ఈ ఎన్నికలలో గెలిచేది! ఓడేది! ఎవరనేది తెలియనప్పటికీ బెట్టింగులు మాత్రం మహా జోరుగా సాగుతున్నాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో కింద స్థాయి నాయకులు అలాగే వ్యాపారస్తులు ఈ బెట్టింగులలో పాల్గొంటున్నారు.వేల రూపాయల నుంచి లక్షల రూపాయల స్థాయి దాటి కోట్లు, పొలాలు ప్రాపర్టీ లతో బెట్టింగ్ లు కాస్తున్నారు.ముఖ్యంగా విశాఖకు సంబంధించి ఈ వ్యవహారం తారా స్థాయికి చేరుకుంది.ఇక్కడ సిటీ పరిధిలో ముఖ్యంగా నాలుగు నియోజకవర్గాలు ఉత్తరం, దక్షిణం, పశ్చిమం, తూర్పు నియోజకవర్గాలకు సంబంధించి హడావిడి ఎక్కువైంది.ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధాన పార్టీలు అంటే కూటమి అభ్యర్థులు, వైసిపి అభ్యర్థులు హోరా హోరీగా అన్ని ప్రాంతాలలో విస్తృత ప్రచారం చేశారు.గెలుపే ధ్యేయంగా పనిచేశారు.ఈసారి కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఊహించని ఫలితాలు రాబోతున్నది తెలుస్తుంది. దీంతో ఎలక్షన్స్ రిజల్ట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎక్కడ చూసినా, విన్నా ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. మరి కొద్ది రోజులలో ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఫలితాల కోసం చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ తర్వాత విశాఖ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది.తాము గెలుస్తామంటూ లేదు తామే గెలుస్తామంటూ పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.కానీ వాస్తవంగా గ్రౌండ్ రిపోర్ట్ ఫలితాలు అనేవి చూస్తే వారి అభిప్రాయాలకు భిన్నంగా ఉందనేది తెలుస్తుంది.ఈ ఎన్నికలలో ఊహించని మార్పులు జరగడం ఖాయం అనేది స్పష్టమవుతుంది.ముఖ్యంగా బిజెపి, టిడిపి, టిడిపి జనసేన కూటమి పక్కా ప్రణాళికతో ఎన్నికల రంగంలోకి దిగింది. అటు వైసిపి కూడా ప్రత్యర్థులను చూసి ఏ మాత్రం బెదరకుండా పోటీకి సై అంది. సరైన అభ్యర్థులను కూడా రంగంలోకి దించింది.గెలుపు పై ధీమాగా ఉంది. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందన్నది కొందరు అభ్యర్థులు సొంతంగా సర్వేలు నిర్వహించుకోగా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సర్వేలు చేపట్టాయి.పార్టీలు కూడా సర్వేలు నిర్వహించాయి.అయితే వారు పూర్తిస్థాయిలో సర్వే ఫలితాలను బయటకు పెట్టకపోవడంతో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పుడువిశాఖ విజేతల పైభారీ బెట్టింగులు జరుగుతున్నాయి.పోలింగ్ నుంచే ఈ జాతర మొదలైంది. ప్రధాన పార్టీ అభ్యర్థుల పై లక్షల్లో బెట్టింగ్లు కొనసాగుతున్నాయి.ఓటింగ్ అధిక శాతం కొన్నిచోట్ల పెరగడంతో స్థానిక గా రాజకీయం వేడెక్కింది.దీంతో గెలుపు గుర్రాలపై లక్షల్లో బెట్టింగులు వేస్తున్నారు.కొద్ది రోజులలో కౌంటింగ్ ప్రక్రియ తర్వాత విజేతలు ఎవరు అనేది తేలిపోవడం జరుగుతుంది.ప్రస్తుతం ఉత్తరాంధ్ర పై దృష్టి కేంద్రీకరించబడింది.ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని వైసిపి ప్రజలకు దగ్గర కాగా వైసిపి వైఫల్యాలు ఎత్తి చూపుతూ తాము గెలిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కూటమి అభ్యర్థులు జనంలోకి రావడం జరిగింది. ఎన్నికల ప్రచారం అయితే చాలా వేడిగా జరిగింది.అయితే పోలింగ్ మాత్రం ఎవరు ఊహించిన విధంగా జరగడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది స్పష్టత లేదు.దీంతో ఎవరికి వారే తామే గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ప్రకటనలు గుప్పిస్తున్నారు.పోలింగ్ తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారాయి. దీంతో విశాఖలో ఎక్కడకక్కడ రాజకీయాల కోసమే చర్చలు కొనసాగుతున్నాయి.గెలిచే అభ్యర్థులు ఎవరు ఓడిపోయే అభ్యర్థుల ఎవరు అంటూ చర్చించుకుంటున్నారు. అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉన్నప్పటికీ ప్రజానాడి పట్టుకోవడం ఎలా మాత్రం కష్టంగానే ఉన్నట్లు తెలుస్తుంది.కౌంటింగ్ వరకు అభ్యర్థుల మధ్య నరాల తెగే ఉత్కంఠ కొనసాగుతున్నట్లు సమాచారం.ఇలా ఉండగా మరోపక్క నియోజకవర్గాలలో అభ్యర్థులపైవందల నుండి లక్షల్లో బెట్టింగ్లు జోరు సాగుతుంది.
previous post
next post