యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న “భజే వాయు వేగం” సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు . ఈ నెల 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతుందని ప్రకటించారు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించగా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించిన “భజే వాయు వేగం” సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. . ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్, లిరికల్ సాంగ్ తో ఇప్పటికే ఆడియెన్స్ లో సినిమా పై ఒక బజ్ క్రియేట్ అయింది “భజే వాయు వేగం” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ గురువారం ఉదయం రిలీజ్ చేస్తున్నారు
previous post