Vaisaakhi – Pakka Infotainment

ఘనంగా దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు..

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫిలింఛాంబర్ ప్రాంగణంలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ను ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ ఈవెంట్ డేట్ పోస్టర్ ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అతిధులు మాట్లాడుతూ దాసరి గారు దర్శకుల సంఘానికే కాదు అన్ని సినీ కార్మిక సంఘాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుకొచ్చేవారన్నారు.. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఇవాళ ఎంతోమంది ఆయన జయంతి కార్యక్రమానికి వస్తున్నారు. అలా ఒక దర్శకుడిని స్మరించుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించేవారు దాసరి, వారి కష్టం తెలుసుకుని సాయం చేసేవారు. అలాంటి గొప్ప లక్షణం ఉండబట్టే ఇప్పటికీ దాసరి గారిని గుర్తుపెట్టుకుంటున్నామన్నారు. గతంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ జరిపినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మన డైరెక్టర్స్ ట్రస్ట్ కు 25 లక్షల రూపాయలు విరాళం అందించారు. అప్పటి నుంచి డైరెక్టర్స్ డే అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందుకు చిరంజీవి గారికి థ్యాంక్స్ చెబుతున్నామన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More