ది రైజ్ తో ప్రపంచ సినీ ప్రేమికులను ఒక ఊపు ఊపిన పుష్ప రాజ్ ఇప్పుడు రూల్ చెయ్యడానికి రాబోతున్నాడు.. నిర్మాణంలో వున్న సీక్వెల్ పుష్ప-2 ది రూల్ గురించి ఎటువంటి అప్డేట్ అయినా సన్పేషన్. తాజాగా చిత్ర యూనిట్ ఇచ్చిన అప్డేట్తో అటు ఐకాన్‌స్టార్ అభిమానులు, ఇటు పుష్ప ప్రేమికులు సంబరాల్లో వున్నారు. ‘పుష్ప-2’ దిరూల్ రేపటి నుంచి ప్రపంచమంతా పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అంటూ పుష్పమయం కాబోతుంది మేకర్స్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లోపుష్ప….. పుష్ప… పుష్ప… పుష్పరాజ్ అనే తొలి లిరికల్ వీడియోను రాబోతుంది ఈ అప్డేట్తో ఐకాన్‌స్టార్ అభిమానులు సంబరాల్లో వున్నారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.పూర్తి మాస్‌గెటప్‌లో నడుస్తూ కనిపిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫెరోషియస్ లుక్ తో అభిమానులకు ఫుల్‌మీల్స్ పెడుతుంది. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప-2 ద రూల్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది.