కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచిన బేబీ తరువాత అదే రేంజ్ లో మరో హిట్ కొట్టేందుకు మారుతీ టీమ్ ప్రయత్నాలు ప్రారంభించింది.. అందుకు తగ్గట్టుగానే యూత్ ని ఆకట్టుకునే కంటెంట్ ను సిద్ధం చేసుకుని పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలుపెట్టారు..డైరెక్టర్ మారుతి టీమ్ ప్రోడక్ట్ మరియు వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వం వహిస్తుండగా ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా ప్రకాష్ రౌతు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు..ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి, దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ చిత్రం మే రెండు నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. విజయ్ బుల్గాని సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రఫీ సిద్ధం మనోహర్ ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ భీమగాని సాంకేతిక నిపుణులు.