ఒకప్పటి నటీనటులు కేవలం నటనకు మహా అయితే కొద్ధో గొప్పో సేవాకార్యక్రమాలు చేయడం.. ఇంకా ముందుకెళ్తే రాజకీయాలోకి రావడం.. వీటికి మాత్రమే పరిమితమయ్యేవారు.. నిజం చెప్పాలంటే వ్యాపారకాంక్ష అస్సలు లేనోళ్లు.. ఇప్పటి నటీనటులు అందుకు భిన్నం.. హీరోలు.. హీరోయిన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు స్క్రీన్ పై కనపడే చాలామంది వారి వారి నటనను కొనసాగిస్తూనే వ్యాపారాలు చెయ్యటం మొదలుపెట్టారు.. నటభూషణ్ శోభన్ బాబు , మురళీమోహన్ మొదలుకొని చాలామంది రియల్ ఎస్టేట్ లో తమ ముద్ర వేసినవారున్నారు.. హోటల్ ఇండస్ట్రీలో ఎక్కువమంది తమ సత్తా చాటుతుండగా.. హీరోయిన్లు ఫిట్నెస్ రంగంలోను, బోటిక్స్ లోను తమ మార్క్ చూపిస్తున్నారు.. విజయ్ దేవరకొండ అయితే ఏకంగా సల్మాన్ ఖాన్ లాగా ఒక క్లాతింగ్ బ్రాండ్ ని తీసుకొచ్చి యువత కు రౌడీ ఫీల్ తీసుకొచ్చాడు.. ఇలాంటి బిజినెస్ లు ఎన్ని చేసిన ఈ తరం హీరోలు ఎగ్జిబిటర్ రంగం లో తమ సత్తా చాటలన్న ప్రయత్నం గట్టిగానే మొదలుపెట్టారు.. స్వర్గీయ నందమూరి తారకరామారావు రామకృష్ణ థియేటర్ స్ఫూర్తితో స్టార్ హీరోలు థియేటర్ వైపు చూస్తున్నారు.. కొంతమంది దర్శకులు ఇప్పటికే సినిమా థియేటర్ల ను మెయింటైన్ చేస్తుండగా చూస్తున్నాం. సూపర్ స్టార్ మహేశ్ బాబు గచ్చిబౌలిలో ఏషియన్ వాళ్ళతో కలసి ఏ ఎమ్ బి మాల్ (AMB MALL) ప్రారంభించిన తరువాత విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ఏ వీ డి(AVD) పేరుతో మల్టిప్లెక్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన కొత్త మాల్ ని ప్రారంభించబోతున్నారు.. అమీర్ పేట లో సినిమా అంటేనే సత్యం ధియేటర్ 1980 లోసూపర్ స్టార్ కృష్ణ నటించిన సిరిమల్లె నవ్వింది చిత్రం తో ప్రారంభమై ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా అభిమాన ధియేటర్ గా పేరు పొందింది.. ఇప్పుడు అదే స్థానంలో భారీ మల్టీఫ్లెక్స్ నిర్మించారు. ఏషియన్ తో కలసి ఏషియన్ అల్లుఅర్జున్ గా దీనికి నామకరణం చేశారు కొత్త గా అన్ని ఆధునిక హంగులతో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ ని ట్రిపుల్ ఏ సినిమాస్ (AAA CINEMAS) గా వ్యవహరించనున్నారు.. జూన్ 16న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ తో ఈ మల్టీఫ్లెక్సును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఆ చిత్ర హీరో డార్లింగ్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా మల్టీప్లెక్స్ ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. (ప్రభాస్ తొలిచిత్రం ఈశ్వర్ సత్యం థియేటర్ లొనే విడుదలైన విషయం ఇక్కడ గమనార్హం..) ఆదిపురుష్ రిలీజ్ కు కేవలం రెండు వారాలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో.. మల్టీప్లెక్స్ నిర్మాణపనులను మరింత వేగవంతం చేసారు.. మల్టీఫ్లెక్సు ఐకాన్ స్టార్ ది కావడం తో బన్నీ ఫాన్స్ లో ఆనందం వ్యక్తం అవుతోంది.. మహేష్, విజయ్ దేవరకొండ, బన్నీ లాగే మరి కొందరు హీరోలు సొంత థియేటర్లు ఏర్పాటుకు ముందుకు వస్తారేమో చూడాలి మరి..
previous post
next post