అల్లరి నరేష్.. ఇప్పుడు ఉగ్రం నరేష్ గా పేరు మారిన ఆశ్చర్యపోనవసరం లేదు.. ఉగ్రం సినిమాలో నరేష్ నటనలో ఉగ్రరూపం చూపాడనే చెప్పవచ్చు. వరుసగా తాను చేస్తున్న మూస సినిమాల నుంచి నాంది సినిమాతో తన ఉన్న అసలైన నటుడిని పైకి తీసుకొచ్చారు. ఆ సినిమా హిట్ గా నిలవడంతో మళ్లీ ఆ సినిమా చేసిన విజయ్ తోనే ఉగ్రం అనే మరో సినిమాకి నాంది పలికారు. రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ఉగ్రం మూవీ మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. నరేష్ వన్ మాన్ షో గానే ఈ సినిమా నడిచిందని చెప్పాలి. సినిమా మొత్తం నరేష్ చుట్టే తిరుగుతుంది. సుమారుగా ప్రతి సీన్ లోను నరేష్ కనిపిస్తూనే ఉంటారు. డైరెక్టర్ విజయ్ ఒక మంచి స్టోరీ తో తీసిన ఉగ్రం మూవీ నరేష్ ను హీరోగా ఒక మెట్టు పైకి తీసుకెళ్లిందనే చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు స్లోగా నడిచిన కథనం, ఇంటర్వెల్ తర్వాత మరింత స్పీడ్ అందుకొని ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో నరేష్ పర్ఫామెన్స్ అద్భుతం. చివర్లో వచ్చే ఫైట్ సీన్ లో నరేష్ బీభత్సాన్ని సృష్టించారనే చెప్పవచ్చు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమా మొత్తం నైట్ ఎఫెక్ట్లో చేయడంతో పాటు కెమెరా పనితనం, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యావని చెప్పవచ్చు. ఈ సినిమాలో చేసిన నటీనటులందరూ తమ పాతలకు తగ్గట్టుగా నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం సినిమాకు చాలా ప్లస్ అయిందని చెప్పవచ్చు. అల్లరి నరేష్ తన కెరీర్ లోనే ఉగ్రం మూవీలో బెస్ట్ పెర్ఫార్మన్స్ చేశాడని ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చెబుతున్నాడు. కథలో ఎదురైన మిస్టరీని హీరో నరేష్ సాల్వ్ చేసే విధానం అందరిని ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ తీరు ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , ప్రొడక్షన్ వాల్స్యూస్ ఆసమ్. సినిమా స్థాయిని ఈ రెండూ పెంచాయనే చెప్పాలి. మొత్తానికి నరేష్ ఉగ్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్గా నిలిచిందనే చెప్పాలి. నచ్చుతాయి.
previous post
next post