ఒకప్పుడు సంధ్య35ఎమ్ ఎమ్ ధియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పనిచేసిన తీపిరెడ్డి మహిపాల్ రెడ్డి తన పేరు ని దర్శకుడిగా బిగ్ స్క్రీన్ పై చూసుకోవాలన్న కోరికను తీర్చిన చిత్రం ‘పోస్టర్’ ప్రముఖ ott యాప్ ఆహా లో ఏప్రిల్28 నుంచి స్ట్రీమింగ్ మొదలయ్యింది. తనలోని టాలెంట్‌ని స్క్రీన్ పై చూపించాలనుకున్న దర్శకుడు మహిపాల్ రెడ్డి తొలి ప్రయత్నం ‘పోస్టర్’ సినిమా ఆహా లో మంచి వ్యూస్ దక్కించుకునే దిశగా వెళ్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొత్త దర్శకుల విజనే వేరు.. వచ్చిన అవకాశం సద్వినియోగ పరచుకుని టాలీవుడ్ లో తమ ప్లేస్ ని సుస్థిరం చేసుకోడానికి పడుతున్న తపన అంతా ఇంతా కాదు.. అలా కొత్త దర్శకుడు మహిపాల్ రెడ్డి చేసిన తొలి ప్రయత్నం `పోస్టర్` పబ్లిసిటీ విషయం లో మరి ముఖ్యంగా సినిమాల్లో పోస్టర్ అనే పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి క్యాచి టైటిల్‌తో శ్రీ సాయి పుష్ప క్రియేషన్స్ బేనర్ పై మహిపాల్ రెడ్డి తో కలసి టీ శేఖర్ రెడ్డి, ఐ జీ రెడ్డి, ఏ గంగారెడ్డి లు నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ ధరన్, రాశిసింగ్, అక్షత సోనావానే హీరోహీరోయిన్లుగా నటించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఇలాంటి కథతో చాలా సినిమాలు గతంలో వచ్చినప్పటికీ రొటీన్ ఫీలింగ్ రాకుండా ప్రెజెంట్ జెనరేషన్ కి కనెక్ట్ అయ్యేలా అవుట్ పుట్ ఇవ్వడంలో దర్శకుడు మహిపాల్ రెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక పోస్టర్ సినిమా కథ విషయానికి వస్తే సిద్దిపేట కి చెందిన శ్రీను(విజయ్ ధరన్) ఆవారాగా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి(శివాజీరాజా) పనిచేస్తున్న థియేటర్ ఓనర్ అయిన పెద్దారెడ్డి కూతురు మేఘన(అక్షత)తో ప్రేమలో పడతాడు. విషయం తెలియని పెద్దారెడ్డి.. శ్రీనుని తన దగ్గరే పనిలో పెట్టుకుని సెటిల్మెంట్స్ చేయిస్తుంటాడు. అయితే తన కూతురిని శ్రీను లవ్ చేస్తున్నాడని తెలుసుకున్న పెద్దారెడ్డి తన మనుషులతో శ్రీను ఇంటిపై దాడి చేసి ఊరందరి ముందు వారి పరువు తీస్తారు. దీంతో అవమానం గా ఫీలైనతండ్రి శ్రీను ని ఇంటి నుండి గెంటేస్తాడు.అలా ఇల్లొదిలి వెళ్లిన శ్రీను లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది….? సెకండ్ హాఫ్ లో వచ్చే తులసి (రాశి సింగ్) పాత్ర ఏంటి.? శ్రీను ప్రేమ లోకి ఎవరొచ్చారు.. జీరో లా బయటకు వెళ్లిన శ్రీను హీరో గా ఎలా మారాడు అన్నది మిగతా కథ. సినిమాలోని అసలు ఫ్లాట్‌ని ఓపెన్ చేయకుండా ఆ సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా కథని ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ సరదాగా నవ్వించే ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ మెప్పిస్తాయి.. విలేజ్ నేటివిటీ తో ఇంటర్వెల్ పార్ట్ కొత్తగా ఉంది. క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.
కొన్ని సీన్స్ ట్రిమ్ చేసుంటే సినిమా మరింత ఇంట్రస్ట్ గా మారేది.. ల్యాగ్ ఆడియెన్స్ ని కొంత ఇబ్బంది పెడుతుంది. సెకండాఫ్‌లో కూడా కొంత స్లో నెరేషన్ ఉన్నప్పటికీ స్టోరీని మలుపులు తిప్పిన విధానం కొత్తగా ఉండటంతో ఆడియెన్స్ కి సెకండ్ హాఫ్ నచ్చుతుంది.. కొత్త లొకేషన్స్ కావడం వలన ఫీల్ బాగా వర్కౌట్ అయింది. నటీనటుల విషయానికి వస్తే విజయధరన్ ఇంటెన్స్ యాక్టింగ్‌తో మెప్పించాడు. అయితే నటన లో ఇంకా మెచ్యూర్టీని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రాశి సింగ్ పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకోగా మరో హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ అండ్ మోడ్రన్ లుక్ లో ఇంప్రెసివ్ గా ఉంది.. పోస్టర్ లో ఆదరగొట్టే పెర్ఫార్మెన్స్ ఎవరిదైన ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ శివాజీరాజా మాత్రమే. తండ్రి పాత్రలో ఆయన ఒదిగిపోయారు.. అలాగే తల్లిగా నటించిన మధుమణి కూడా తన సహజ నటనతో మెప్పించింది. పెద్దిరెడ్డిగా రామరాజు హీరో ఫ్రెండ్స్ గా రవీందర్ ఓకే అనిపించారు సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే దర్శకుడు మహిపాల్ రెడ్డి ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాలనుకున్నది స్పష్టం గా చెప్పే ప్రయత్నం చేసినప్పటికి అడిషనల్ సీన్స్ విషయంలో ఇంకొంచెం ఆలోచిస్తే లాగ్ కూడా ఉండేది కాదేమో అనిపించక మానదు.. కొత్త దర్శకుడన్న ఆలోచన రానివ్వకుండా సినిమాను తెరకెక్కించిన తీరు అభినందనీయం.. అండర్ కరెంట్ గా సొసైటీ కి ఒక సందేశాన్ని అందించే పోస్టర్ చిత్రానికి సంగీతం ప్లస్ పాయింట్.. శాండీ అద్దంకి పాటలు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగున్నప్పటికి కొద్దిగా డ్యూరేషన్ విషయంలో ఆలోచించాల్సింది. ఓవరాల్ గా ఎబౌ యావరేజ్ కేటగిరీకి చెందిన చిత్రం గా పోస్టర్ మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశం ఉంది.