తెలుగు సినిమా కు స్వర్ణయుగం గా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలంలో లక్ష రూపాయల రెమ్యనరేషన్ అంటే చాలా గొప్పవిషయం. అతికొద్ది మంది స్టార్ హీరోలు మాత్రమే లక్ష రూపాయల రెమ్యునరేషన్ ను అందుకునేవారు. ఆ లిస్ట్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు కూడా ఉన్నారు. అయితే వీరికంటే ముందే ఓ నటుడు లక్షరూపాయల రెమ్యునరేషన్ అందుకున్నారు… ఆయనే పద్మశ్రీ చిత్తూరు నాగయ్య. చిత్తూరు జిల్లాలో జన్మించడంతో ఆయన పేరు ఇండస్ట్రీలో చిత్తూరు నాగయ్యగానే పాపులర్ అయ్యారు. నిజానికి ఆయన అసలు పేరు ఉప్పులపూడి నాగయ్య శర్మ సద్బ్రహ్మణ కుటుంబానికి చెందిన నాగయ్య బాల్యమంతా తిరుమల తిరుపతిలోనే జరిగింది. చదువు అనంతరం గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేసిన నాగయ్య కొంత కాలం ఆంధ్రపత్రికలో జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు. నటన పై ఆయనకు ఉన్న ఆసక్తి చెన్నై కి చేర్చింది. 1938 మార్చి 12న హెచ్ఎం రెడ్డి దర్శకత్వం వహించిన గృహలక్ష్మి సినిమాతో నాగయ్య సినీ రంగ ప్రవేశం చేశారు. నటుడిగా పరిచయం అయిన మొదటి సినిమాతోనే ఎంతో గుర్తింపు వచ్చింది. తర్వాత వందేమాతరం, దేవత, భక్త పోతన లాంటి సినిమా ద్వారా పాపులర్ అయ్యారు. నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా నాగయ్య పనిచేశారు. మంచి నటుడిగా గుర్తింపు పొందిన నాగయ్యను పద్మశ్రీ అవార్డు సైతం వరించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల్లోకి రాకముందే భారీ రెమ్యునరేషన్ తీసుకున్న ఘనత ఆయనకే సొంతం. అప్పట్లో ఆయన రెమ్యునరేషన్ చూసి అంతా షాక్ అయ్యేవారు. ఒక్కో సినిమాకు నాగయ్య లక్ష రూపాయల రెమ్యునరేషన్ కూడా తీసుకునేవారు. 1943 జనవరి 7వ తేదీన విడుదలైన భక్త పోతన సినిమాతో నాగయ్య మొట్టమొదటి తెలుగు సినిమా స్టార్ హీరోగా మారిపోయారు. కె.వి.రెడ్డి మొట్టమొదట దర్శకత్వం చేసిన సినిమా కూడా భక్త పోతనే. అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా కలెక్షన్ల రికార్డును అధిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. నాగయ్య నటించిన ఏడవ సినిమా భక్త పోతన. తర్వాత ఆయన నటించిన పడమూడవ చిత్రం యోగి వేమన వరకు చిత్తూరు నాగయ్య నంబర్ వన్ స్టార్ హీరోగా వెలుగొందారు. ఈ సినిమానే ముమ్మిడివరం బాలయోగి ని ఆధ్యాత్మికత వైపు నడిపించిందంటే ఆ సినిమా ప్రజలపై ఎంత ప్రభావం చూపించిందో నాగయ్య ఆ పాత్ర లో ఎంత ఒదిగి పోయారో అర్ధం చేసుకోవచ్చు. నాగయ్యను ఆ స్థాయికి తీసుకెళ్లి స్టార్ హీరోగా నిలబెట్టింది మాత్రం దర్శకుడు కెవి రెడ్డినే ఆ తర్వాత వందేమాతరం(1939), విశ్వమోహిని, సుమంగళి(1940) దేవత(1941)లో భక్త పోతన, భాగ్యలక్ష్మి (1943) , స్వర్గసీమ(1945), త్యాగయ్య(1946), యోగి వేమన(1947) సినిమా వరకు ఎంతో వైభవంగా తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని స్టార్ హీరోగా ఏలి రికార్డు సృష్టించారు. 1953లో విడుదలైన గుమస్తా సినిమా వరకు దాదాపుగా హీరో గానే కొనసాగారు. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల రాకతో వైభవం తగ్గి చివరి వరకు సహాయ నటుడు గానే కొనసాగి అత్యంత దయనీయ పరిస్థితుల్లో కన్నుమూశారు.
previous post
next post