ఇండియన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్లలో నంబర్ వన్ లో రేస్ లో ముందున్న రాజమౌళి గురి హాలీవుడ్ పైనే పెట్టాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలబెట్టి పాన్ ఇండియన్ మూవీ గా మార్చిన ఆస్కార్ ఒడిలో కూర్చోబెట్టిన ఘనత ఆయనదే. ఇప్పుడు అదే తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకు వెళ్లేందుకు ఆర్.ఆర్. ఆర్ మూవీ తో చేసిన ప్రయత్నం హండ్రెడ్ పర్సన్ట్ సఫలం అయింది. ఆస్కార్ అవార్డు కూడా దాదాపు ఖాయమనే ప్రచారం కూడా జోరు అందుకుంది. ఒకవేళ అదే నిజమైతే అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకి మరింత కీర్తి లభించడం ఖాయం. అయితే ఈ క్రమంలో ఆస్కార్ అవార్డుకు సంబంధించి ఆర్.ఆర్.ఆర్ టీం కోట్ల రూపాయలను ప్రచారం కోసం వాడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా సీనియర్ దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ దీనిపై చేసిన కామెంట్లు కూడా మరింత వివాదానికి కారణం అయ్యాయి. అతని వ్యాఖ్యలకు మెగా బ్రదర్ నాగబాబు దర్శకుడు కె రాఘవేంద్రరావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాజమౌళి అనవసరంగా అంత డబ్బుఖర్చు పెట్టిస్తున్నాడని భరద్వాజ తో పాటు మరికొందరు చేస్తున్న ప్రచారం పై కూడా నేడు చర్చ జరుగుతుంది. రాజమౌళి ఏ పని చేసిన చాలా దూర దృష్టితో చేస్తాడు. చాలా ముందు చూపుతో చేసిన పనుల వల్ల నష్టాలు కంటే లాభమే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో గతంలో రాజమౌళి తను చేసింది కరెక్ట్ అని నిరూపించారు కూడా. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా అనేది నంబర్ వన్ స్థానంలో ఉంది. దానికి కారణం రాజమౌళినే చెప్పవచ్చు. ఇప్పుడు అదే తెలుగు సినిమాకు అంతర్జాతీయంగా మార్కెట్ తీసుకువచ్చేందుకు ఆస్కార్ వేదికను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నది వాస్తవం. త్వరలో మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు అంతర్జాతీయ మార్కెట్ సంపాదించాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాను మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించబోతున్నారు. ఈ సినిమా అక్కడకు తీసుకువెళ్లి దానికి మరింత మార్కెట్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ లో మార్కెట్ జరగాలనే ముందస్తు ఆలోచనతో ఆర్.ఆర్.ఆర్ మూవీని అక్కడ బాగా ప్రమోట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి జనం నిరాజనం పడుతున్నారు. ఈ మూవీ సక్సెస్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు వస్తే రాజమౌళికే కాదు తెలుగు సినిమాకి కూడా మరింత ఖ్యాతి వస్తుంది. ఈ అవార్డు తెలుగు సినిమాకు మరిన్ని అవకాశాలను తెప్పిస్తుందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో వచ్చిన మూవీ అంతర్జాతీయ స్థాయిలో మంచి విజయం అందుకుని భారీ వసూళ్లను రాబడితే ఇక ఇండియన్ సినిమాలు వరుసగా హాలీవుడ్ పై దాడి చేయడం ఖాయమనిపిస్తుంది. పాన్ ఇండియన్ మూవీలకు గాడ్ ఫాదర్ గా చెప్పుకుంటున్న రాజమౌళి పాన్ వరల్డ్ సినిమాకు కూడా అతనే అందరికీ ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడనటం లో ఎటువంటి సందేహం లేదు. ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి ఖర్చు పెడుతున్న ప్రతి పైసా హాలీవుడ్ లో తెలుగు సినిమా జెండా పాతడానికే అనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అసలు విషయం తెలియని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు మాత్రం అదేపనిగా కావాలని ఆరోపణలు చేస్తూ ఉండటం అలవాటుగా మారింది. తెలుగు సినిమా కోసం అలాగే భారతీయ సినిమా కోసం ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ప్రయత్నం కానీ కృషికానీ భవిష్యత్తులో ఇండియన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కాలర్ ఎగరేసే స్థాయికి వెళ్తుందనేది మాత్రం వాస్తవం.
previous post
next post