మైత్రి మూవీ మేకర్స్ పట్టిందల్లా బంగారం అవుతుందని ఈవెంట్ లలోనే కాదు.. ఇండస్ట్రీ మొత్తం లో వినిపిస్తున్న మాట. ఏ సినిమా చేసిన అది బాక్సాఫీస్ ను షేక్ చేసి వరుసగా హిట్ సినిమాలు తీస్తూఅగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందిన మైత్రీ ఇటీవలే సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేర్ వీరయ్య, నందమూరి బాలకృష్ణ తో వీర సింహారెడ్డి వంటి భారీ సినిమాలను తీసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకే సమయంలో రిలీజ్ చేసి వరుస విజయాలను అందుకున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ షేక్ చేసి భారీ వసూళ్లను సాధించాయి. ఇప్పుడు అదే బ్యానర్లో నెల తిరగకుండానే మరో మూవీ విడుదలకు సిద్ధం చేశారు.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన ‘అమిగోస్’ మూవీ ఈ నెల 10న రిలీజ్ కానుంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశారు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసిన ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. బింబిసారా వంటి భారీ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొత్త దర్శకులను ఎప్పుడు ప్రోత్సహించే కళ్యాణ్ రామ్ ఈ సినిమా ద్వారా రాజేంద్ర రెడ్డి అనే నూతన దర్శకుడికి అవకాశం ఇచ్చారు. దర్శకుడు చెప్పిన కథ తనకు ఎంతో బాగా నచ్చిందని, బింబి సారా వంటి భారీ హిట్ సాధించిన తర్వాత తాను ఇటువంటి కథ కోసమే ఎదురుచూస్తున్నానని చెప్పారు. దర్శకుడు రాజేంద్ర రెడ్డి చెప్పిన కథ తనకెంతో బాగా నచ్చిందని అన్నారు. అందుకే అతనితో కలిసిపని చేయడానికి నిర్ణయం తీసుకుని ఈ సినిమా ప్రారంభించినట్లు వెల్లడించారు. అటు నిర్మాతలు కూడా ఈ సినిమా పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. తమ బ్యానర్ లో సంక్రాంతి పండుగ తర్వాత వస్తున్న మూడో సినిమా అని వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాగే ఈ మూవీ కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని, తమ బ్యానర్ కు హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాల్తేర్ వీరయ్య, వీరసింహరెడ్డి చిత్రాలను సొంత డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ తో విడుదల చేసిన మైత్రీ మూవీస్ అమిగోస్ చిత్రాన్ని మాత్రం టేబుల్ ప్రాఫిట్ కి అన్ని రైట్స్ ని ఇప్పటికే విక్రయించేసింది. దాదాపు గా పదిహేడు కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో నిర్మాణ సంస్థ ఫుల్ హ్యాపీ గా ఉందని సమాచారం. బింభిసార విడుదల తరువాత ఈ సినిమా రైట్స్ అమ్మిఉంటే ఇంకా భారీ లాభాలు వచ్చేవని విశ్లేషకులు అంటున్నారు.. నిర్మాతల లాభాలను పక్కన పెడితే కళ్యాణ్ రామ్ కెరీర్లో నే భారీ హిట్ నమోదు చేసి అతి ఎక్కువ కలెక్షన్స్ పోస్టర్ వేసుకోబోతుందని అభిమానులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు.
previous post
next post