వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి దర్శకులపై చేసిన సూచన లాంటి హాట్ కామెంట్స్ ఇప్పుడు ఫిలింనగర్ లో వేడిని రగిలించాయి.. వీరయ్య ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోయినా సంక్రాంతి సినిమాల్లో ఇదొక్కటే కాస్త బెటర్ అన్న టాక్ నడుస్తున్న వేళ సినిమాను మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో చిరు వ్యాఖ్యలు ఇప్పుడు బాగానే గుచ్చుకున్నాయి. వీరయ్య దర్శకుడు బాబిని పొగిడే క్రమంలో కొంత మంది డైరెక్టర్స్ కి గట్టి పంచ్ వేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన కామెంట్లకు వాళ్ళు హర్ట్ అవుతారేమో అని వైపు అంటూనే లెంగ్త్ తీసే డైరెక్టర్ కి ఘాటుగానే చురకలు అంటించారు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఎడిటింగ్ చేసుకొని క్రిస్పీగా ప్లాన్ చేసుకోవాలని.. అద్భుతమైన కథ ఇవ్వడమే కాదు ఇన్ బడ్జెట్లో తీయడమే మొదటి సక్సెస్ అని వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ బాగుండాలంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయినటువంటి దర్శకులు బాధ్యతాయుతంగా ఉండాలని అప్పుడే తెలుగు సినిమా అభివృద్ధి సాధ్యమని అంటూ తన వ్యాఖ్యలను రాంగ్ గా ప్రాజెక్ట్ చేయొద్దు అని మీడియా కూడా మరోవైపు సున్నితంగా సుద్ధులు చెప్పారు. క్లాసు పీకుతున్నాన అంటూనే చెప్పాల్సిందంతా చెప్పి అనాల్సిందంతా అన్న చిరంజీవి హాట్ కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. అయితే చిరంజీవి చెప్పినట్లు దర్శకులు ఒక్కరే బాధ్యతగా ఉంటే సరిపోతుందా..? అన్నది కొందరి ప్రశ్న. నిజానికి ఎలివేషన్స్ కోరుకొని బడ్జెట్ ను వందల కోట్లకు దాటించి ఘనత గౌరవ హీరోలదే అన్నది కొందరి మాట. రూపాయి మార్కెట్ లేని హీరోలు కూడా తలకు మించిన బడ్జెట్ పెట్టించే పరిస్థితులు టాలీవుడ్ లో నెలకొన్నాయి అన్నది నిర్వివాదాంశం. అవకాశాల్ని ఎలాగైనా వినియోగించుకోవాలనుకునే కొంతమంది దర్శకులు హీరోలు చెప్పినట్లు తలాడించి ముందుకెళ్తున్న సందర్భాలే ఎక్కువని చిరంజీవి వ్యాఖ్యలు ఒక దర్శకులకే కాకుండా సినిమా రంగంలో ఉన్న అందరికీ వర్తిస్తాయని కొంతమంది సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు దీన్నొక వివాదంగా కాకుండా ఆత్మవిమర్శగా తీసుకోవాల్సిన అవసరమే ఎక్కువని అన్ని విభాగాలు దీని సవాలుగా తీసుకొని చిరంజీవి చెప్పినట్లు బాధ్యతాయుతంగా మార్చుకుంటే చిన్న పెద్ద తేడా లేకుండా తెలుగు సినిమా వెలుగుతుంది లేదు కాదు అనుకుంటే వెండితెర వెలిసిపోతుంది ఆ మసకల మాటున నలిగిపోయేది సినిమా నమ్ముకున్న జీవులే..
previous post