ఉప్పెన చిత్రం హిట్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన కన్నడ బ్యూటీ కృతి శెట్టికి గుడ్ టైం అప్పుడే అయిపోయినట్లే కనిపిస్తుంది. వరుస ప్లాపులతో హ్యాట్రిక్ రికార్డును తన అకౌంట్లో వేసేసుకుంది. క్రియేటివిటీ, టాలెంట్ కన్నా సక్సెస్ కొలమానం పైనే ఎక్కువ ఆధారపడ్డ సినిమా ఇండస్ట్రీ సక్సెస్ కు దూరంగా జరుగుతున్న వారిని తిరిగి నెత్తికెక్కించుకున్న దాఖలాలు లేనే లేవు. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన తారలనే తరువాత ప్లాప్లిస్తే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేసిన సందర్భాలు కోకొల్లలు.. అలాంటిది మళ్లీ కృతి శెట్టిని తిరిగి లైమ్ లైట్ లోకి తీసుకొస్తారా అంటే చాలామంది బ్లాంక్ ఫేస్ పెడతారు. ఉప్పెన సినిమా కమర్షియల్ హిట్ తో వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసిన ఈ టీనేజ్ బ్యూటీ గాలి అప్పట్లో గట్టిగానే వీచింది.. మూడు షూటింగ్ లు నాలుగు రిబ్బన్న్ కటింగ్స్.., ఆరు యాడ్స్ తో క్షణం తీరికలేని అవకాశం కల్పించేసారు మన తెలుగోళ్లు. ఉప్పెన విడుదల అనంతరం సైన్ చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చాలాకాలం వెయిటింగ్ పీరియడ్ తర్వాత విడుదలై ‘ఏం చెప్పక్కర్లేదు’ అని ప్రేక్షకులు అనేటట్లు గా ఫలితాన్ని అందుకుంది అంతకుముందే ‘ది వారియర్’ తో డుగ్గు డుగ్గు అంటూ బుల్లెట్ మీద వచ్చిన రొటీన్ స్టోరీస్ కి రామ్ రామ్ చెప్పేసామని ఆడియోన్స్ థియేటర్ కి వెళ్లడం మానేశారు తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’తో నితిన్ తో ఏదో హడావిడి చేద్దామనుకున్నా దాని రిజల్ట్ కూడా సేమ్ టు సేమ్. రెండు ఫ్లాపులతో స్పీడు తగ్గుతున్న కృతి శెట్టి కి మూడోసారి అదే ఫలితం ఎదురైంది అస్సలు కలిసి రాలేదు. ఏదో ఫ్లోలో ‘బంగార్రాజు’ పాస్ అయిపోయినా శ్యామ సింగరాయ్ విషయంలో అది వర్కవుట్ అవ్వలేదు. కృతి శెట్టి కన్నా సాయి పల్లవి క్రెడిట్ కొట్టేసింది. సినిమాల రెమ్యూనరేషన్ డేట్స్ విషయంలో కృతిశెట్టి అమ్మ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అన్న కామెంట్స్ చిన్నగా వినపడిన సక్సెస్ వుంటే అవన్నీ గ్రేట్ పరిధిలోకి వెళ్లిపోయి ఉండేవి ఇప్పుడు మాత్రం ఒకదానికి పదిసార్లు థింకాల్సిందే… సక్సెసాయ నమః