లతా మంగేష్కర్ ప్రత్యేక పరిచయం అక్కర్లేని భారతరత్నం చిత్ర సీమలో ఎనిమిది దశాబ్దాల ముద్ర తొలత మరాఠి చిత్రాల్లో బాలనాటిగా పేరు తెచ్చుకుని తర్వాత పాటలు పాడడం ఆరంభించింది 1942 లో మరాఠీ చిత్రం కీఠీ హాసాల్ నాచూయా గడే అన్న పాటలో ఓ చరణం తో సంగీత ప్రపంచానికి పరిచయమైంది. లతా మంగేష్కర్ బాల్యం నుంచి మంగేష్కర్ సంగీత సాధన తో పాటు పాటల పాడుతూనే ఉంది తన తండ్రి దీనానాద్ మంగేష్కర్ గాయకుడిగా గొప్ప కీర్తి అయితే పొందారు కానీ ఆస్తులు ఏమి సంపాదించలేదు. ఆయన హఠాన్మరణం తరువాత పెద్దదైన లతా బుజ స్కందాలపై మీద భారం పడింది ప్రముఖ నట దర్శకుడు మాస్టర్ వినాయక్ దామోదర్ చేరదీసి తమ చిత్రాల్లో వేషాలు ఇచ్చి ఆదుకున్నాడు ఆ తర్వాత పాటలు పాడటం ఆరంభించింది లత మొదటి పాట లోని కొన్ని లైన్లు పాడినందుకు అందుకున్న మొత్తం 30 రూపాయలు మాత్రమే. అయితే ఈ పాట సినిమా లో పెట్టలేదు. తరువాత మళ్ళీ పహ్లీ మంగలాగౌర్ (1942) నటాలీ చైత్రచీ నవాలాయి అనే గీతం పాడారు. ఆ తర్వాత బొంబాయి టాకీస్ వారి మజ్బూర్లో సోలో సాంగ్ పాడే అవకాశం లభించింది ఆ పాటకు 150 రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్న లత మరి వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె మరణించిన నాటికి ఆమే ఆస్తుల విలువ రెండువందల కోట్ల పైమాటే నని అనుకున్నారు. 36భారతీయ భాషల్లో పాటలు పాడిన లతా రెండు తెలుగు చిత్రాలలో కూడా పాడిన ఆమె పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లను కూడా అందుకున్నారు..
previous post