జిల్లా ఎస్పీ ఇచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ ఎంపీ లో ఎవరెస్టు అంత బలాన్ని నింపింది.. కులపెద్దలు పలికిన ఘన స్వాగతం వెయ్యేనుగుల శక్తి నిచ్చింది.. విపక్ష పార్టీలపై విరుచుకు పడుతున్న మీడియాను చూడగానే ఎక్కడలేని మనోధైర్యం వచ్చి పడింది.. ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. ప్రైవేటు ఎఫ్ఫైర్ ని పబ్లిక్ లోకి పెట్టి వైరల్ చెయ్యడం లో సక్సెస్ అయిన తెలుగుదేశం పార్టీ దాన్ని ప్రాపర్ గా తీసుకెళ్లడం లో మాత్రం ఘోరంగా విఫలమైన విషయాన్ని కూడా ఇవే స్పష్టం చేస్తున్నాయి.. ఒక అశ్లీల చిత్రానికి అంత ప్రాధాన్యత నిచ్చి అనుకూల మీడియాల్లో ఇరవై నాలుగుగంటల డిస్కషన్స్ కి తెర తీయడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు న్యూడ్ కాల్ అన్న విషయం పక్కకు పోయి వీడియో అసలా…? మార్ఫింగా..? అన్న కోణం లోకి ఈ అంశం డైవర్ట్ అయిపోయింది.. ఇలా టర్న్ తీసుకోవడానికి కారణం కూడా టీడీపీ వైఖరే కారణమని విశ్లేషిస్తున్నారు.. ప్రయివేట్ గా యూఎస్ లోని ఓ ఫోరెన్సిక్ లాబ్ లో పరీక్ష చేయించి అది ఒరిజినల్ అని నిర్ధారిస్తే ఆ లాబ్ నిజమే అయినా టెక్నీషియన్ మాత్రం కేవలం ఆడియో వీడియో ఎక్స్పెర్ట్ మాత్రమే అని నీలి మీడియా కౌంటర్ గట్టిగానే ఇస్తుంది. ఏది ఏమైనా స్ట్రెయిట్ గా వెళ్లాల్సిన కేసు వాగులు వంకలు తిరిగి ఎన్నో టర్నింగు లు తీసుకుని ఇప్పుడు ఏమి లేదన్నట్టు కలరింగ్ ఇస్తోంది… ఇంతకీ న్యూడ్ వీడియో తప్పా.. వీడియో రిలీజ్ చెయ్యడం తప్పో కన్ఫర్మ్ చేసుకోలేక జనాలు కన్ఫ్యూజన్ పడిపోయారు.. ఇక కొసమెరుపు ఏంటంటే ఆ వీడియో మార్ఫింగ్ అన్న వైసీపీ వాళ్ళ మాటలే నిజమైతే అంత గొప్ప గ్రాఫిక్స్ చేసిన వ్యక్తి మాకు కావాలి అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ కోరుకుంటోంది.
previous post
next post