ఇటీవల వస్తున్న థ్రిల్లర్, పేట్రియాటిక్, స్కామ్ మూవీస్ లలో మిస్ అయిన ఎంటర్ టైన్ మెంట్ “ధూం ధాం” లో వుంటుందని ప్రేక్షకులు కొనే టికెట్ ధరకు విలువైన ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది గ్యారంటీ గా ఇస్తుందని ఆ చిత్ర దర్శకుడు సాయి కిషోర్ మచ్చా చెప్పారు.. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాత గా చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “ధూం ధాం” నెల 8వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోన్న నేపథ్యంలో దర్శకుడు సాయి కిషోర్ మచ్చా విలేకరులతో ముచ్చటించారు. నేను శ్రీను వైట్ల గారి దగ్గర వర్క్ చేశాను. ఉషా కిరణ్ మూవీస్ లో ఓ సినిమాకు ప్లాన్ చేశాం. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం మూవీకి డైరెక్షన్ టీమ్ ను లీడ్ చేశాను. ఆ తర్వాత త్రిష హీరోయిన్ గా నటించిన బృందా సిరీస్ కు వర్క్ చేశాను. ఇలా మూవీస్ కు వర్క్ చేస్తున్న టైమ్ లో రైటర్ గోపీమోహన్ గారు “ధూం ధాం” సినిమా ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు బాగా కనెక్ట్ అయ్యింది. అలా ఈ సినిమా మొదలైంది. మొత్తం షూటింగ్ అమెరికాలో చేయాలని ముందుగా అనుకున్నాం. అయితే అనుమతుల కోసం ఆరు నెలలు ప్రయత్నించినా కుదరలేదు. ఆ తర్వాత యూరప్ లో షూటింగ్ చేద్దామని పోలెండ్ ను సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ చిత్రీకరణ జరిపాం. పోలెండ్ లో కూడా మాకు ఇండియా ఉన్నట్లు భోజన, ఇతర వసతులు కల్పించారు నిర్మాత రామ్ కుమార్. ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, సినిమా మీద ఉన్న ప్యాషన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. దాంతో పాటు మంచి ప్రేమ కథ ఉంటుంది. తండ్రీ కొడుకుల అనుబంధం కారణంగా వల్ల నాయిక జీవితంలో ఒక అనుకోని ఘటన జరుగుతుంది. దాన్ని సరిదిద్దేందుకు హీరో ఎలాంటి ప్రయత్నం చేశాడు అనేది కథ. సినిమా సరదాగా మొదలై ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్ తో ప్లెజెంట్ గా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి పెళ్లి ఇంట జరిగే సందడి మిమ్మల్ని హిలేరియస్ గా నవ్విస్తుంది. వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో బాగా నవ్విస్తాడు. మా ప్రొడ్యూసర్ రామ్ కుమార్ గారికి మైత్రీ నవీన్ గారు మంచి ఫ్రెండ్. అలా కాంటాక్ట్ అయి సినిమా చూపించాం. వారికి బాగా నచ్చి రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు.
హీరో చేతన్ మంచి టాలెంటెడ్ హీరో. అతనిలో నటుడిగా మంచి టైమింగ్ ఉంది. తండ్రి కోసం కొడుకు పడే ఒక ఆరాటాన్ని తన పాత్రలో చూస్తారు. కామెడీ, ఫైట్స్, రొమాంటిక్, ఎమోషనల్..ఇలా ప్రతి సీన్ లో చేతన్ బాగా నటించాడు. అతనికి ఈ సినిమా మంచి ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. హెబా పటేల్ కూడా తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించింది. సెట్ లో కూడా తను చాలా యాక్టివ్ గా ఉండేది. “ధూం ధాం” సినిమాలో సాయి కుమార్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ వంటి కాస్టింగ్ ఉంది. వీరితో పాటు రామజోగయ్య శాస్త్రి గారు, గోపీ సుందర్, మంగ్లీ స్క్రీన్ మీద మెరుస్తారు. ఇంతమంది పేరున్న ఆర్టిస్టులు ఉన్నా.. హీరోకున్న ప్రత్యేకత కథలో అలాగే ఉంటుంది. రామజోగయ్య శాస్త్రి గారు సింగిల్ కార్డ్ రాశారు. అలాగే మంచి మ్యూజిక్ ఇచ్చారు గోపీ సుందర్. రీసెంట్ టైమ్స్ లో “ధూం ధాం” వంటి ఛాట్ బస్టర్ ఆల్బమ్ రాలేదు. రామజోగయ్య గారికి మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సన్మానం చేస్తున్నాం. రీసెంట్ గా వైజాగ్ లో పెయిడ్ ప్రీమియర్స్ వేశాం. ఆ ప్రీమియర్స్ లో దాదాపు ప్రతి సీన్ కు ప్రేక్షకులు బాగా నవ్వుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ తో చాలా హ్యాపీగా అనిపించింది. ఈనెల 8వ తేదీన అన్ని థియేటర్స్ నుంచి ఇలాంటి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు సాయికిశోర్.