Vaisaakhi – Pakka Infotainment

రానా దగ్గుబాటి , దుల్కర్ సల్మాన్, సెల్వరాజ్, ల మల్టీలింగ్వల్ ఫిల్మ్ ‘కాంత’ షూటింగ్ ప్రారంభం

రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్‌ కొలాబరేషన్లో మల్టీ లింగ్వల్ ప్రాజెక్ట్ “కాంత” హైదరాబాద్‌లోని రామా నాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్టరీ వెంకటేష్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కు జోడిగా భాగ్యశ్రీ నటిస్తున్నారు. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.
1950 మద్రాస్‌ బ్యాక్ డ్రాప్ లో హ్యూమన్ రిలేషన్స్, సోషల్ చైంజెస్ ని ఎక్స్ ఫ్లోర్ చేసే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ గా ఈ సినిమా వుండబోతోంది.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ..కాంత కోసం వేఫేరర్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం ఈ ప్రాజెక్ట్‌కి కొత్త డైమెన్షన్ ని యాడ్ చేసింది. క్యాలిటీ సినిమా పట్ల మా విజన్ ఒకేలా వుంటుంది. సురేశ్ ప్రొడక్షన్స్ 60వ యానివర్సరీని పురస్కరించుకుని, స్పిరిట్ మీడియాతో కొత్త శకానికి నాంది పలికేందుకు పర్ఫెక్ట్ మూవీ ‘కాంత”. అన్నారు హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ” స్పిరిట్ మీడియాతో ‘కాంతా’తో ఈ జర్నీ ప్రారంభించడం పట్ల ఉత్సాహంగా ఉన్నాను. ఇది మానవ భావోద్వేగాల లోతులను ఆవిష్కరించే అందమైన లేయర్డ్ కథ. ఒక నటుడికి పెర్ఫార్మెన్స్ చేయడానికి చాలా స్కోప్ ఇస్తుంది. ఈ సినిమాకి ప్రాణం పోసినందుకు నేను థ్రిల్ అయ్యాను’ అన్నారు
డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ మాట్లాడుతూ”ఇటువంటి ప్రతిభావంతులైన నిర్మాతలు, క్రియేటివ్ టీంతో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. కాంతతో, మేము ప్రేక్షకులను గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని లక్ష్యంగా పని చేస్తున్నాం’ అన్నారు
ప్రశాంత్ పొట్లూరి, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ , జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ గా టాప్ లెవల్ లో వుండబోతోంది. డాని శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాను సంగీతం సమకూరుస్తున్నారు. రామలింగం ఆర్ట్ డైరెక్టర్, రైటర్ తమిళ్ ప్రభ. లెవెల్లిన్ ఆంథోనీ గొన్సాల్వేస్ ఎడిటర్.Bఈ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. త్వరలోనే ప్రాజెక్ట్ కి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More