మహిళలపై జరుగుతున్న వేధింపులపై ఒక్కొక్కరుగా తమ వాయిస్ వినిపిస్తున్నారు.. వారికి గతం లో జరిగిన వేధింపులు.. ఇప్పుడు ఇండస్ట్రీ లో వెలుగు చూస్తున్న వాస్తవాలపై.. ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు.. ఈ తరహా వేధింపులు కేవలం మలయాళ పరిశ్రమలోనే కాదు.. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలోనూ ఉన్నాయని నటి షకీలా.., కేరళలోని WCCని టాలీవుడ్ స్ఫూర్తిగా తీసుకొని. 2016లో ఏర్పాటు చేసిన ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ కమిటీ రిపోర్ట్ టాలీవుడ్ వెల్లడి చేయాలని దీనిపై తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని హీరోయిన్ సమంత.., ఇలా ఒక్కొక్కరు గా బయటకొచ్చి డిమాండ్ చేస్తున్నారు.. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై నటీమణులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.. మహిళలపై వేధింపులు మలయాళ పరిశ్రమలోనే కాదు.. తమిళం, తెలుగు ఇండస్ట్రీలలోనూ ఉన్నాయని.. “ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగేవారు అడుగడుగునా కనిపిస్తారని సీనియర్ నటి షకీలా తెలిపారు.. మొదట్లోనే అలాంటి పని చేయమని గట్టిగా చెప్తే ఈ తరహా సమస్యలు రావని కమిటీలు, నివేదికలు కేవలం వేధింపుల విషయాన్నే మాత్రమే బయట పెడుతున్నాయని చెప్తూనే బాధ్యులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి” అని షకీలా డిమాండ్ చేసారు..
అలాగే సమంత కూడా ఈ అంశంపై తన వాయిస్ లేవనెత్తారు.. లైంగిక వేధింపులపై టాలీవుడ్‌లో ఏర్పాటైన కమిటీ నివేదికను విడుదల చేయమని మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికను టాలీవుడ్ మహిళల తరఫున స్వాగతిస్తున్నామని ఆమె అన్నారు. కేరళలోని WCCని టాలీవుడ్ స్ఫూర్తిగా తీసుకోవాలని “తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై 2016లో ఏర్పాటు చేసిన ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ పేరుతో కమిటీ రూపొందించిన నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నా” అని సమంత తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసీ ఈ అంశం పై అగ్గి రాజేశారు..
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసులు నమోదు కాగా… గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టినందుకు తనకు సోషల్ విూడియా వేదికగా బెదిరింపు సందేశాలు వస్తున్నాయని ఓ నటి వాపోవడం గమనార్హం.. కొంత మంది నటుల వల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నటి మిను మునీర్ ఆరోపించగా అయితే ఈ విషయం బయపెట్టిన దగ్గరి నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్తూ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ విూడియాలో పోస్ట్ చేశారు.అన్నింటినీ తట్టుకొని సినిమా కోసం పని చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ వారి వేధింపులు మితివిూరాయని వాపోయారు. ఈ సంఘటన వల్ల తాను మానసికంగా ఎంతో కుంగిపోయానని ఆమె పేర్కొన్నారు.
హేమ కమిటీ నివేదికలో వెలుగుచూసిన అంశాలపై మా కుటుంబ సభ్యులతో కూడా చర్చించానని మరో నటి నివేధా థామస్ చెప్పుకొచ్చారు. డబ్ల్యూసీసీని ఈ విషయంలో ప్రశంసించాలి. వాళ్ల చొరవ వల్లే ఇది సాధ్యమైంది. మహిళలకు పనిచేసే చోట భద్రత కల్పించడం కనీస అవసరం. దీని గురించి నేనూ రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మనం ఇంట్లో ఎంత సమయం ఉంటున్నామో దానికంటే ఎక్కువ సమయం పని ప్రదేశాల్లో గడుపుతాం. అలాంటిచోట భద్రత అనేది అత్యవసరం అని నివేదా పేర్కొన్నారు. ఇదిలా వుండగా మరోవైపు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తో పాటు 17 మంది సభ్యులున్న పాలక మండలి పదవుల నుంచి వైదొలిగింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం తో నైతిక బాధ్యతగా వీరంతా రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.