హీరో ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “తల్వార్” ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వార్నిక్ స్టూడియోస్ బ్యానర్ పై భాస్కర్ ఇ.ఎల్.వి నిర్మాణంలో నూతన దర్శకుడు కాశీ పరశురామ్ రూపొందిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు అతిథిలుగా పాల్గొన్నారు. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, హీరో కార్తికేయ స్క్రిప్ట్ హ్యాండోవర్ చేశారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించబోతున్నారు. వారి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
next post