కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ 131వ మూవీ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైయింది. కార్తీక్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ కన్నడ తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ ని పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, సుధీర్ పి నిర్మిస్తున్నారు. భాషాభేదాలను చేరిపేసుకున్న తెలుగు సినిమా ఎందరో పరభాషా నటులను ఓన్ చేసుకుంది. గౌతమి పుత్ర శాతకర్ణి వంటి డైరెక్ట్ తెలుగు చిత్రం లో కనపడ్డ ఆయన హీరోగా ద్విభాషా చిత్రం లో కనిపించనున్నారు. శివరాజ్ కుమార్‌ని పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసే ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు వున్నాయి. హై-బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎ.జె శెట్టి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ దీపు ఎస్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ రవి సంతే హక్లే.
previous post
next post