పెద్ద కష్టం లో వున్న తెలుగు సినిమా కోలుకోడానికి తిరిగి పూర్వ ప్రాభవం తో తలేత్తుకు నిలబడటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే వుంది. పెద్ద సినిమాల నిర్మాతలు ప్రస్తుత టికెట్ ధరలతో మా బడ్జెట్ కు వర్కౌట్ అవ్వదు.. రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి మహాప్రభో అని ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటుంటే మా సినీమా టిక్కెట్లు తగ్గించాం ధియేటర్ లోనే మా సినీమా చూడండి అని చిన్న నిర్మాతలు ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు.. పెద్ద సినిమాలు వేలకోట్ల కలెక్షన్ రికార్డుల పోస్టర్లు వేస్తుంటే చిన్న సినిమాల నిర్మాతలకు పోస్టర్ అంటించిన ఖర్చులు కూడా రాక లబోదిబోమంటున్నారు.. ధియేటర్లలో పదివేలు కూడా రాబట్టుకోలేని సినిమాలు ఓటీటీ ఫ్లాట్ఫామ్ (ott) లలో టాప్ వన్ ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇటీవల విడుదలైన మ్యూజిక్ షాప్ మూర్తి అమెజాన్ ప్రైమ్ లో సూపర్ హిట్ ని అందుకుంది.. అలాగే కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం సత్యభామ ది కూడా అదే పరిస్థితి.. కల్కి చిత్రం టిక్కెట్ రేట్లు దాదాపు 350 రూపాయులు దాటినా చూసిన జనం చిన్న, మధ్య తరహా చిత్రాలను సాధారణ రేట్లకు కూడా చూడటానికి ఇష్టపడటం లేదు.. ఒక్కొక్కటిగా సింగిల్ స్క్రీన్ లు అదృశ్యం అయిపోతూ కొన్ని మల్టీప్లెక్స్ లు గా. రూపాంతరం చెందితే మరికొన్ని కమర్షియల్ కాంప్లెక్సులు అయిపోతున్నాయి. మల్టీప్లెక్స్ లో ఫ్యామిలీ మొత్తం సినీమా చూడాలంటే.. పెద్ద ఫైనాన్షియల్ మెటర్ గా మారిపోయింది.. ఆఫ్టర్ కరోనా ott లకు బాగా అలవాటు పడ్డ జనం ధియేటర్ కు వెళ్ళడం మానుకున్నారు.. నాలుగు రోజులు ఆగితే టీవీ లో చూడొచ్చు అనుకున్న జనాలు ఎక్కువవడంతో ధియేటర్లు వెల వెల పోతున్నాయి.. సినిమాల పరిస్థితి ఇలావుంది అని నిర్మాణమవుతున్న చిత్రాల సంఖ్య తగ్గుతుందా అంటే నిర్మాణం అవుతున్న సినిమాల సంఖ్య విపరీతం గా పెరిగిపోయింది..
రోజుకు రెండు సినిమాలు చూస్తున్నప్పటికీ సెన్సార్ చేయలేక పోతున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అధికారులకు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న సినిమాలు నిజానికి ఇబ్బందినే కలుగ జేస్తున్నాయి.. రాశి కన్నా వాసిలో ఎప్పుడు ముందుండే తెలుగు సినిమా స్వర్ణ యుగం నుంచి కూడా అదే ఒరవడి లో ముందుంది.. రాజమౌళి పుణ్యమాని తెలుగు సినిమా ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్న పాన్ ఇండియా పెద్ద చిత్రాల విజయం కింద నలిగిపోతున్న చిన్న చిత్రాల విషాదాన్ని పట్టించుకునే పరిస్థితి లేనేలేదు.. ఇండస్ట్రీ లో ఎవరు ఔనన్నా కాదన్నా మెజార్టీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది మాత్రం చిన్న సినిమాలే.. చిన్న సినిమాల వునికి ప్రశ్నార్థకం గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో దిద్దుబాటుగా టికెట్ల ధరలను తగ్గించుకుని ముందుకు వస్తున్నాయి.. మొన్న ఓ చిత్రం కేవలం ఏభై రూపాయల టిక్కెట్ తోనే ప్రేక్షకుల ముందుకొస్తే అల్లు శిరీష్ నటించిన బడ్డీ, వరుణ్ సందేశ్ విరాజీ సినిమాలు సింగిల్ స్క్రీన్ 99 మల్టీప్లెక్స్ 125 టిక్కెట్ ధరలతో ముందుకొస్తున్నాయి.. వందరోజులు, ఏభై రోజుల రికార్డుల నుండి కలెక్షన్ రికార్డు లకు ఎప్పుడైతే వచ్చిందో చిన్న సినిమా ఉలికిపాటుకు గురయింది.. ఏదో అలా నెట్టుకొస్తున్న దానికి కరోనా కొట్టిన దెబ్బనుండి టిక్కెట్ తగ్గింపు ప్రయత్నం ఎంత వరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే..
.