నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీ రాయన్ సెన్సార్ పూర్తచేసుకుంది. సెన్సార్ బోర్డ్ సినిమాకి A సర్టిఫికేట్ ఇచ్చింది.
దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. హై యాక్షన్ ఎక్కువగా ఉండే సినిమా రన్‌టైమ్ 2:25 గంటలుగా లాక్ చేశారు. దాదాపు రెండు వారాల్లో సినిమా విడుదల కానున్నందున మేకర్స్ ప్రమోషన్స్‌లో దూకుడు పెంచనున్నారు. అపర్ణ బాలమురుగన్, ఎస్‌జె సూర్య, సెల్వరాఘవన్, దుషార విజయన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ సంగీతం అందించారు. మొదటి రెండు పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఓం ప్రకాష్ డీవోపీగా పని చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్ కాగా, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా జూలై 26న విడుదల కానున్న ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేయనుంది.