కిరణ్ అబ్బవరం పీరియాడిక్ థ్రిల్లర్ కు “క” అనే సింగిల్ లెటర్ తో ఇంట్రెస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు. శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ లను పరిచయం చేస్తూ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీ గా వుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు. కిరణ్ అబ్బవరం కొంత విరామం తర్వాత చేస్తున్న “క” సినిమా అనౌన్స్ మెంట్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
previous post