Vaisaakhi – Pakka Infotainment

తగ్గేదెవరు…!

చక్రం తిప్పడంలో చాణక్యుడి కంటే గొప్పవాడు చంద్రబాబునాయుడు..తన పదునైన ప్రసంగాలతో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రాగల సత్తా ఉన్న మేటి నాయకుడు పవన్ కళ్యాణ్.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కో గల ధైర్యం గల నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.. వీరి ముగ్గురి కోసం ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ముగ్గురు చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయం తిరుగుతుంది. సీఎం కుర్చీ కోసం రసవత్తర పోరు సాగుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే ఎలాగైనా వైసీపీ ని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని బహిరంగంగానే చెబుతున్నాయి. ఆయా సందర్భాలలో అవసరం వచ్చినప్పుడు తమ లక్ష్యం వైసిపిని గద్దె దించడమే అని దీనికోసం అవసరమైతే మిగతా పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈ ప్రకటనలతో ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు ఉండబోతుందనే ఊహాగానాలు ఎక్కువైయ్యాయి.ఈ విషయం ఇరు పార్టీలు స్పష్టం చేయనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే రెండు పార్టీలు కలిసి పనిచేయడం సరైనదని రెండు పార్టీల నేతలు ఫిక్స్ అయిపోయున్నారు.. వాస్తవ పరిస్థితులు అవలోకిస్తే . టిడిపితో కలిసి వెళ్లడం జనసేన లోని కొంతమంది పార్టీ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదన్నది ఇంటర్నల్ టాక్. జనసేన సపోర్ట్ లేకుండా టిడిపి ఒంటరిగా పోటీ చేసి జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం అసాధ్యమని ఆ నేతలు బహిరంగగానే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కు సీఎంగా అవకాశం ఇస్తే పొత్తు కోసం ఆలోచించొచ్చు తప్పా లేకుంటే పొత్తు అనవసరం అని గుసాగుసలాడుతున్నారు సీనియర్ నేత హరి రామ జోగయ్య స్పష్టం చేసిన విషయాన్నే ఆ పార్టీలోని మిగతా నాయకులు ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవల్లో ఆలోచిస్తున్న పార్టీ నేతలు మాత్రం తగ్గేదేలే.. అని చెప్తున్నారు.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది. అన్ని ల్సీ స్థానాలను వైసీపీ గెలవాలనే లక్ష్యంతో పనిచేసింది. కానీ ఊహించని విధంగా మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. ఈ మూడు స్థానాలు చేజారి పోవడంతో దీనిపై అంతర్గతంగా ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల టిడిపి గెలిచిందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే ఇంకోపక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటూ ఏమీ లేదని వామపక్ష పార్టీల ఓట్లతోనే టిడిపి అభ్యర్థులు గెలిచారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొనడం విశేషం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే రిపీట్ అవుతుందని మెజార్టీ సీట్లు టిడిపి గెలుచుకుంటుందని టిడిపి నేతలు జోస్యం చెబుతున్నారు. టిడిపికి పగటి కలలు కనడం అలవాటేనని వచ్చే ఎన్నికలలో వైసీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఆ పార్టీ నేతలు అందరూ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం కుర్చీ కోసం, అధికారం కోసం తెలుగుదేశం, వైసీపీలు వాదులాడుకోవడం గమనిస్తున్న జనసేన పార్టీ తాము కూడా ఆ పోటీలో ఉన్నామని సుస్పష్టం చేస్తుంది. గతంలో కంటే నేడు జనసేన పార్టీకి ప్రజాధరణ మరింత పెరిగిందని, వచ్చే ఎన్నికలను ప్రభావితం చేయగల సత్తా జనసేన పార్టీకి ఉందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కలిసి జగన్ మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని భావించిన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఇప్పుడు సీఎం కుర్చీ అడ్డుగా మారింది. జగన్ మోహన్ రెడ్డి పై పోరాటం కంటే సీఎం కూర్చో కోసమే టిడిపి- జనసేన మధ్య వాదన జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కి కూడా అదే కావాలి. ఏ పార్టీకి ఆ పార్టీ తామే అధికారంలోకి వస్తాము అని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. టిడిపి – జనసేన అధినేతల కంటే ఆ పార్టీల ఇతర నేతలు మాత్రం ఎవరికి వారు తమకు తోచినట్లు తమ అభిప్రాయాలను వెల్లడి చేస్తున్నారు. కానీ ఈసారి టిడిపి గెలవకపోతే ఆ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితం అయిపోతుంది. పాలనపై మరింత పట్టును సాధించిన జగన్మోహన్ రెడ్డి తన టార్గెట్ పవన్ కళ్యాణ్ అవుతాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం టిడిపి- జనసేన మాత్రమే కారణంగా చెప్పొచ్చు. సీఎం పదవి మీద దృష్టి కంటే వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తే ఫలితం ఉంటుంది. లేదంటే జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టడం ఖాయమని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం అయితే వైసిపి వైనాట్175 అని గెలుపు పై చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. ఈ సమయంలో టిడిపి- జనసేన పార్టీలో అధికారం కోసం వాదులాడుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ కు సీఎంగా అవకాశం ఇస్తేనే టిడిపి చెప్పొత్తు ఉంటుందని జనసేన నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఒకవేళ పొత్తు కాకుండా జనసేన సింగిల్ గా పోటీకి వెళ్తే వైసీపీని ఏమాత్రం అడ్డుకోలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి సరైన బలం లేదు. ప్రతి మీటింగ్ కి వచ్చే జనం కూడా ఓట్లు వేస్తారనే నమ్మకం లేదు. అలా ఓట్లు వేసి ఉంటే గత ఎన్నికలలో తను సులువుగా గెలిచే వాడినని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. టిడిపితో జనసేన పొత్తు ఆ పార్టీకే లాభం అన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విడిగా పోటీ చేస్తే జనసేన మూడో స్థానంలోనే ఉంటుంది. ఒకటి రెండు స్థానాలను వైసిపి టిడిపి పంచుకుంటాయి. అదే 2024లో అయితే పూర్తిగా పరిస్థితులు మారిపోతాయి. అప్పటి పరిస్థితుల ప్రకారం టిడిపి , జనసేన కలిసి పోటీ చేస్తే సులువుగా అధికారం చేపట్టడం జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ సీఎం కుర్చీ కోసం కాపు కాసి ఉన్న జనసేన అధికారంలో తమకు భాగస్వామ్యం ఉంటేనే టిడిపి తో పొత్తు కోసం ఆలోచిస్తామని చెప్పడం ఆ పార్టీకి ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More