ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ని “న్యూ టాలెంట్ రోర్స్ @” బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. అక్కినేని నాగార్జున బర్త్ డే మరియుతెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రాజెక్ట్ కి సంబధించిన ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా 1980 నేపథ్యంలో వుంటుందని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ.. సభకు నమస్కారం. సినిమా 1980 నేపథ్యంలో ఈ కథ జరగబోతోంది. ఈ నేపథ్యం బలీయమైన తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం ఇది. తెలుగు భాషా, సంస్కృతి, విలువలు గురించి చెప్పాలని ఎప్పటినుంచో భావిస్తున్నాను. సందేశంలా కాకుండా మంచి వాణిజ్య విలువలు వున్న అంశాలు వున్నప్పడే ఇలాంటి కథ చెయ్యాలి. అలాంటి వాణిజ్య విలువలు అన్నీ కుదిరిన కథ ఇది. తెలుగు భాషా దినోత్సవం రోజున, గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినం పురస్కరించి ఈ నేపధ్యం ప్రకటించడం చాలా ఆనందంగా వుంది. ఇందులో కొన్ని సన్నివేశంలో భావోద్వేగాలని పద్యరూపంలో కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇది తెలుగు భాషకు ఇస్తున్న ఒక జ్ఞాపిక లాంటి ప్రక్రియ. చాలా కష్టపడి పని చేస్తాం. మీ అందరికీ నచ్చేలా చేస్తాం’ అన్నారు
లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘తెలుగు భాష తియ్యదనం. తెలుగు జాతి గొప్పతనం. తెలుసుకున్నవాళ్లకి తెలుగే ఒక మూలధనం’ అని ఒక పాటలో రాశాను. ప్రపంచంలో అత్యంత మధురమైన భాషల్లో రెండోవది తెలుగు. ప్రపంచంలో అత్యంత సుందరమైన లిపి కలిగిన భాష తెలుగు. రెండు రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష తెలుగు. తెలుగుభాషలో మాధుర్యం, సౌందర్యం చాటి చెప్పేలా ఎందరో కవులు ఎన్నో చక్కని పాటలు రాశారు. నేను కూడా నా ప్రయాణంలో ఎన్నో చక్కని పాటలు రాస్తున్నాను. ఈ సినిమాలో మరింత అందమైన అర్ధవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతోంది. ఆ అవకాశం కల్పించిన మా దర్శకులు చౌదరిగారికి, సంగీత దర్శకులు కీరవాణి గారికి ధన్యవాదాలు. చౌదరిగారితో నా ప్రయాణం సీతయ్య సినిమాతో ప్రారంభమైయింది. నాకు ఎన్నో చక్కని అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి పాటలు తెలుగు సినిమాకి, భాషకి అందిస్తాననే విశ్వసం వుంది’ అన్నారు.
డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. తెలుగు భాషా దినోత్సవం ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ చేయడం మామూలు విషయం కాదు. హ్యాట్సప్ చౌదరి గారు. తెలుగు వాడు తెలుగు భాష గొప్పదనం గురించి తెలుగువాళ్ళకి చెప్పడం విచిత్రమైన పరిస్థితి. తెలుగు భాష బ్రతుకు తెరువు కాదు బ్రతుకు. తెలుగంటే అమ్మ. అమ్మ పని చేయలేదని బయటికి పంపించేద్దామంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి వుండదు. తెలుగు మాట్లాడితే తల్లితండ్రులు, టీచర్లు కొప్పడే పరిస్థితి తెలుగులోనే వుంది. సమాజాన్ని నిర్మించేది తల్లితండ్రులు ఉపాధ్యాయులు. ఇప్పుడున్న సమాజం ఇలానే కొనసాగితే ఉనికి కోల్పోయే పరిస్థితి వుంటుంది. తెలుగు గొప్ప భాష. పద్యం తెలుగుకే సొంతం. ఇప్పుడున్న సమాజంలో మార్పు రావాలంటే తల్లితండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు తెలుగు నేర్పించండి’ అని కోరారు.
నిర్మాత గీతా యలమంచిలి మాట్లాడుతూ.. రమేష్ గారు నేను కలసి ఈ భాద్యతని సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తామని నమ్ముతున్నాం. వైవిఎస్ చౌదరి గారు, కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సాయి మాధవ్ బుర్రా గారితో అషోసియేట్ కావడం ఆనందంగా వుంది’ అన్నారు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ అత్తిలి మాట్లాడుతూ.. చౌదరి గారు చాలా మందిని పరిచయం చేశారు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. సినిమా అనేది ఒక విశ్వవిద్యాలయం. అక్కడ చాలా నేర్చుకోవచ్చు. మంచి చెడులని గ్రహించవచ్చు. మేము నలుగురం స్నేహితులం కలసి మూవీ ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నాం. చౌదరిగారితో కలసి వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. చౌదరి గారి అంకితభావం అద్భుతం. ఆయన ప్రతి సినిమా విలువలతో కూడి వుంటుంది. కష్టపడిపని చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ తో మంచి సక్సెస్ పొందాలని, మీ అందరి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాం’ అన్నారు.
previous post
next post