మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో హీరో అండ్ డైరెక్టర్ ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నారు.ఈరోజు జరుపుకుంటున్న హీరో గోపీచంద్ తన అభిమానులకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘విశ్వం’ మూవీ నుండి ఓ సరికొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అల్ట్రా స్టైలిష్ అవతార్ లో మ్యాచో స్టార్ బైక్ పై వస్తున్న పోస్టర్ ను ‘విశ్వం’ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో గోపీచంద్ చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోండగా, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టిజి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
previous post
next post