సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతి వస్తున్నాం.ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. సంక్రాంతికి ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాని అద్భుతంగా ఫినిష్ చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేక్షకులకి, ఫ్యాన్స్ కి, ఫ్యామిలీస్ కి అందరికీ ఈ సినిమా నచ్చుతుందని
హీరో విక్టరీ వెంకటేష్ అన్నారు.
అనిల్ రావిపూడి,దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గతంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల కానుందని డేట్ తో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ‘ రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి. అన్ని సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీ బావుంటుంది. అనిల్ తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ కథని చాలా బాగా రాశారు. అద్భుతంగా తీశారు. సినిమా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది నా కెరియర్లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమాల్లో పని చేసిన యాక్టర్స్, టెక్నిషయన్స్ అందరికీ థాంక్స్. ఈ సినిమా సంక్రాంతికి వండర్ఫుల్ ఫిల్మ్ కాబోతుంది. డెఫినెట్ గా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం. అలాగే బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా కూడా మేమే చేస్తున్నాం. ఈ మూడు సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాని మొదలుపెట్టినప్పుడే సంక్రాంతికి రావాలని ఫిక్స్ అయ్యాం. తను అనుకున్న కథ, క్యారెక్టర్స్ ని అద్భుతంగా స్క్రీన్ పైకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమా రషస్ చూసి నాన్ స్టాప్ గా నవ్వుకున్నాను. నాకు ఎఫ్2 బెస్ట్ సినిమా చెబుతుంటాను. అనిల్ క్యాలెండర్ లో సంక్రాంతికి వస్తున్నాం బెస్ట్ సినిమా గా నిలుస్తుంది. ఐశ్వర్య తెలుగు అమ్మాయి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతుంది .మీనాక్షి ఎక్సలెంట్ క్యారెక్టర్ చేస్తుంది. అలాగే వీటి గణేష్ గారు, నరేష్ గారు అందరూ ఈ సినిమాలో మిమ్మల్ని అలరించబోతున్నారు. బీమ్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. వెంకటేష్ గారితో అక్కడ మా కోలాబరేషన్ స్టార్ట్ అయింది. అలాగే ఎఫ్2 సంక్రాంతి వచ్చింది. ఎఫ్ 3 తర్వాత సంక్రాంతికి వస్తున్నాం తో పండక్కి వస్తున్నాం. సీతమ్మవాకిట్లో, ఎఫ్2 సినిమాలో ఎలా అయితే సంక్రాంతికి పెద్ద హిట్ అయ్యాయో సంక్రాంతికి వస్తున్నాం కూడా అంత పెద్ద హిట్ కాబోతోంది. వెంకటేష్ గారు ప్రొడ్యూసర్స్ హీరో సురేష్ ప్రొడక్షన్లో సినిమా జరిగితే ఎంత కంఫర్టబుల్ గా జరుగుతుందో అంత కంఫర్టబుల్ గా ఈ సినిమాని చేశారు. ఒక్క ఇబ్బంది కూడా జరగకుండా ఈ సినిమాని చేసుకున్నారు. జనవరి 14 స్పెషల్ డే. 2025 కొట్టబోతున్నాం’ అన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సంక్రాంతి వస్తున్నాం జనవరి 14న మీ ముందుకు రాబోతోంది. సంక్రాంతికి నాకు స్పెషల్ కనెక్షన్ వుంది. సంక్రాంతికి వచ్చిన ఎఫ్ 2 హ్యుజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మహేష్ గారితో చేసిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఇప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారితో, నాకు ఇష్టమైన దిల్ రాజు గారు శిరీష్ గారి బ్యానర్ లో మీ అందరినీ నవ్వించడానికి సంక్రాంతి వస్తున్నాంతో వస్తున్నాం. భగవంత్ కేసరి ఫిల్మ్ మేకర్స్ గా నేను చాలా తృప్తి పొందిన సినిమా. అంతే తృప్తిని ఇచ్చిన సినిమా సంక్రాంతి వస్తున్నాం. జోనర్, స్క్రిప్ట్, రైటింగ్ పరంగా చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ మధ్య జరిగే బ్యూటీఫుల్ జర్నీ. దీన్ని ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో చేయడం జరిగింది. ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు. వెంకటేష్ గారు, నా కాంబినేషన్ హ్యాట్రిక్ ఫిల్మ్ గా రాబోతోంది. లుక్, పెర్ఫార్మెన్స్ పరంగా చాలా టైం స్పెండ్ చేశాం. సుందరకాండ తర్వాత వెంకటేష్ గారు కంప్లీట్ గ్లాసెస్ తో చేసిన సినిమా ఇది. ఇందులో క్లైమాక్స్ లో వన్ మ్యాన్ షో వుంటుంది. అది మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఐశ్వర్య రాజేష్ పాత్ర మీకు గుర్తుండిపోతుంది, మీనాక్షి లో చాలా మంచి ఫన్ టైమింగ్ వుంది. అలాగే ఈ సినిమాలో చేసిన నరేష్ గారితో పాటు అన్నీ పాత్రలు మిమ్మల్ని అలరిస్తాయి. రాజు గారి బ్యానర్ అంటే నా బ్యానర్ లా ఫీల్ అవుతుంటాను. వారితో నా ఐదు సినిమా ఇది. సంక్రాంతి కి సినిమా పెద్ద హిట్ కావాలి. రాజు గారి నుంచి మరో సినిమాగా వస్తున్న రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ఇంకా పెద్ద హిట్ కావాలి. అలాగే నా హీరో బాలయ్య బాబు గారి సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. అన్ని జోనర్ సినిమాలు వున్నాయి. తెలుగు ప్రేక్షకులు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి’ అన్నారు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. భాగ్యం లాంటి పాత్రని స్క్రీన్ మీద రాలేదు. చాలా స్పెషల్ రోల్. ఈ సంక్రాంతి చాలా స్పెషల్ గా వుండబోతోంది. దర్శక నిర్మాతలకు థాంక్. ఈ సంక్రాంతి దిల్ రాజు గారిదే. వెంకటేష్ గారి సినిమా మిస్ అవ్వకుండా చూస్తాం. ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. అంతా ఫ్యామిలీలా ఈ సినిమా చేశాం. ఇది మన సంక్రాంతి’ అన్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఇది నా డ్రీం క్యారెక్టర్. కాప్ రోల్ చేయాలని ఎప్పటి నుంచో వుండేది. ఈ సినిమాతో ఆ డ్రీం నెరవేరింది. చాలా ఫన్ వున్న క్యారెక్టర్. అనిల్ రావిపూడి గారికి థాంక్. వెంకటేష్ గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. దిల్ రాజు గారి బ్యానర్ లో వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. మరిన్ని సినిమాలు వారి బ్యానర్ లో చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ వైఫ్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు, రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.