దిగ్గజ ఓ టి టి ప్లాట్ ఫామ్ తమ అప్ కమింగ్ చిత్రాల జాబితాను ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన రవితేజ ధమాకా తో సహా ఇంకా విడుదల కానివి షూటింగ్ దశలోనే ఉన్నవి ఎన్నో చిత్రాల లిస్టును అనౌన్స్ చేసింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ధమాకా ఈనెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా త్వరలో థియేటర్లలో సందడి చేయబోతున్న అనేక చిత్రాల డిజిటల్ హక్కులను తాము పొందినట్లుగా నెట్ ఫ్లిక్స్ పెద్ద జాబితానే విడుదల చేసింది. మెహర్ రమేష్ చిరంజీవి కాంబోలో వస్తున్న భోళాశంకర్ తో పాటు త్రివిక్రమ్ మహేష్ బాబు వస్తున్న ఇంకా పేరు పెట్టని (SSMB 28) చిత్రం రైట్స్ కూడా నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు విడుదలైన జాబితా తెలియజేస్తోంది.వరుస హిట్ల మీదున్న అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో రాబోతున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్ర హక్కులను కూడా ఈ సంస్థే దాదాపు 11 కోట్లతో డిజిటల్ రైట్స్ పొందిందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ బింభిసార సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో అమిగోస్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్ రిలీజ్ అనంతరం తమ ప్లాట్ ఫారం లో స్ట్రీమింగ్ ఇవ్వనన్నట్లు ప్రకటించింది. అలాగే ఇంకా పేరు పెట్టని వరుణ్ తేజ్ (VT12) చిత్రం, యూవీ క్రియేషన్స్ అనుష్క నవీన్ పోలిశెట్టి చిత్రం, పంజా వైష్ణవ తేజ్ (PVT 04) సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్కేర్’, సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ నాని ప్రతిష్టాత్మక చిత్రం ‘దసరా’ కార్తికేయ ‘బెదురులంక’ :బుట్ట బొమ్మ’ ’18 పేజెస్’ నాగ శౌర్య చిత్రం సందీప్ కిషన్ ‘బడ్డీ’ కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఇలా పెద్ద లిస్టే ప్రకటించింది. ఇందులో పెద్ద, చిన్న చిత్రాలతో పాటు మీడియం రేంజ్ చిత్రాలు కూడా ఉండడంతో ఓటీటీ ప్రేక్షకుల్లో ఎక్కువమంది నెట్ఫిక్స్ బాట పట్టే అవకాశం ఉంది.