Vaisaakhi – Pakka Infotainment

‘డార్లింగ్’ అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్ టైనర్.

నిర్మాత చైతన్య రెడ్డి

హనుమాన్ వంటి హ్యూజ్ హిట్ తరువాత మా బ్యానర్ లో వస్తున్న డార్లింగ్ అందరికి కనెక్ట్ అయ్యే ఎంటర్టైనర్ అని నిర్మాత చైతన్యరెడ్డి చెప్పారు. ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
హనుమాన్ తర్వాత డార్లింగ్ లాంటి స్క్రిప్ట్ చేయడం పై ఆమె స్పందిస్తూ హనుమాన్ రిలీజ్ కి ముందే ఈ చిత్ర షూట్ స్టార్ట్ అయిందనిచెప్పుకొచ్చారు. మ్యారేజ్ అయి పద్నాలుగేళ్ళ తర్వాత లైఫ్ చాలా రొటీన్ అయిపోతుంది. సినిమాకి వెళ్ళడం కూడా ఒక పనిగా చూస్తాం. మొదట్లో ఎలా వున్నాం.. పిల్లలు వచ్చాక జీవితంలో బిజీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నాం.. ఈ పాయింట్ డైరెక్టర్ అశ్విన్ చెప్పినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాం. కంటెంట్ విన్న వెంటనే ఓకే అన్నాం. ఈ జనరేష్ కి అర్ధమేయ్యేలాగ హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా తీర్చిదిద్దాం. ‘డార్లింగ్’ అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్ టైనర్ అని అన్నారు. ఈ చిత్రానికి మొదట వైదిస్ కొలవరి అనే టైటిల్ అనుకున్నాం. అయితే హనుమాన్ సక్సెస్ తర్వాత మాకు టైటిల్ ప్రాముఖ్యత తెలిసింది. వైదిస్ కొలవరి అంటే కేవలం యూత్ కి మాత్రమే పరిమితమవుతుంది. అందుకే చాలా టైటిల్స్ అనుకుని చివరికి డార్లింగ్ కి ఫిక్స్ అయ్యాం. అయితే డార్లింగ్ పేరుతో ఇప్పటికే సినిమా వుంది. అప్పుడు వై దిస్ కొలవరి ని ట్యాగ్ లైన్ గా పెట్టామన్నారు. సినిమా, బిజినెస్ ఈ రెండిలో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అన్న ప్రశ్న కు స్పందిస్తూ లైఫ్ లో సినిమా చూడకుండా, ఎంటర్ టైన్మెంట్ లేకుండా గడిచిన రోజు లేదు. యూఎస్ లో వున్నప్పుడు రోజుకి నాలుగు గంటలు ఎదో కంటెంట్ ని బ్రౌజ్ చేస్తూనే వుండేవాళ్ళం. సినిమా ఎంటర్ టైన్మెంట్ లైఫ్ లో ఒక భాగం అయిపొయింది. ఇప్పుడు అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది. సినిమాతో పోలిస్తే బిజినెస్ మోర్ ఎంజాయ్ చేస్తాను. బిజినెస్ అంతా నేనే చూసుకుంటా. నేను బిజినెస్ లో క్యాలిఫైడ్. రెండు మాస్టర్స్ చేశాను. టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ వుంది. బిజినెస్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. రెండు రంగాల్లో సక్సెస్ అవ్వడం ఆనందం వుంది. ఈ క్రెడిబిలిటీ అంతా దేవుడికి మా పేరెంట్స్ కి ఇస్తాను. నాకు ఫ్యామిలీ సపోర్ట్ వుంది. నిరంజన్ గారు చాలా సపోర్ట్ చేస్తారు. జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి పాజిబుల్ అయ్యేలా లేదు. హనుమాన్ కి ఈ రేంజ్ రీచ్ ని ఊహించలేదు. ఒక మార్వల్ లాంటి స్టొరీ తీసుకోస్తునప్పుడు ఆ రీచ్ వుండాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని చేద్దామనేది మా ఆలోచన. హనుమాన్ పాత్రలో ఏ హీరో కనిపించే అవకాశం వుంది అన్నది హనుమంతుడే డిసైడ్ చేస్తారు. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది హనుమంతుల వారికే వదిలేశాం. పర్శనల్ ప్రిఫరెన్స్ అయితే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. మేము సినిమా కంటే దేవుడి కథ చెప్పాలని అనుకుంటున్నాం. ఆయన ఎలా చెప్పించుకుంటారనేది ఆయన ఇష్టం. హనుమాన్ సినిమా విషయంలో చిరంజీవి గారి సపోర్ట్ ని మర్చిపోలేమన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More