మౌళిటాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతారం లో నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సారు వారు ‘ఏ’ సర్టిఫికెట్‌ను అందజేశారు. కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలోచాలా డిఫరెంట్‌గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమా నవదీప్ 2.Oగా అభిమానులంతాఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుందని మంచి అంచనాలతో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. నవదీప్‌ను సరికొత్తగా చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయన కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్యబోతున్నాడని అంటున్నారు. లైఫ్ లో జరిగిన ప్రేమకథలకు ఫలితమే ఈ సినిమా కథ. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేషన్స్ వున్నాయి. అలాంటి స్వీయ అనుభవాలే ఈ సినిమా కథని విభిన్న ప్రేమకథలు కోరుకునే ప్రేక్షకులందరికి మా లవ్, మౌళి మనసులకు హత్తుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు.
previous post