Vaisaakhi – Pakka Infotainment

ఐఎండిబి టాప్ టెన్ లో టాలీవుడ్ స్టార్స్

ఐఎండిబి అత్యధిక ఆదరణ పొందిన సెలబ్రిటీ జాబితా టాప్ టెన్ లో ఆరుగురు సౌత్ ఇండియన్ సెలబ్రిటీలు చోటు సంపాదించుకున్నారు. ఈ ఆరుగురు లో నలుగురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఉండటం విశేషం. ఈ జాబితాలో అత్యంత ఆదరణ పొందిన హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ఈ జాబితాలో ధనుష్ మొదటి స్థానంలో ఉండగా సెకండ్ పొజిషన్ లో అలియా భట్ మూడవ స్థానంలో ఐశ్వర్యారాయ్ నాలుగవ స్థానాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అందుకున్నారు మిగిలిన తర్వాతి స్థానాలలో వరుసగా సమంత, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, జూనీయర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్, కన్నడ రాకింగ్ స్టార్ యష్ నిలిచారు. అందులోనూ నెంబర్ వన్ స్థానంలో సౌత్ హీరో కావడంతో దక్షిణాది సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2022లో ధనుష్‌కి ‘మారన్’, ‘ది గ్రే మ్యాన్’, ‘తిరుచిత్రంబలం’ అలాగే ‘నానే వరువేన్’ అనే నాలుగు చిత్రాలు అతనికి మంచి పేరును తీసుకొచ్చాయి. అతను నటుడిగా తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించడమే కాకుండా, మరింత గా అభిమానుల ఆదరణను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో నే అతను నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో బాలీవుడ్ నుంచి నిలిచిన అలియా భట్ 2022లో నాలుగు బాలీవుడ్ సినిమాలతో సంచలనం సృష్టించింది. ఆమె నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బ్రహ్మాస్త్ర’, ‘గంగూబాయి కతియావాడి’ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ‘గంగూబాయి కతియావాడి’లో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి ‘డార్లింగ్స్’ మూవీతో నిర్మాతగా కూడా మారారు. ఈ జాబితాలో మూడో స్థానంలో బాలీవుడ్ నుంచి ఐశ్వర్య రాయ్ బచ్చన్ నిలిచారు. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత, ఐశ్వర్య రాయ్ బచ్చన్ 2022 చివరిలో “పొన్నియిన్ సెల్వన్” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన అందంతో మంత్రముగ్ధులను చేసి నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నాలుగో స్థానంలో టాలీవుడ్ టాప్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. “ఆర్.ఆర్.ఆర్”, ‘ఆచార్య’లో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు చిత్రాలలోనూ రెండు పవర్ ఫుల్ పాత్రలలో రామ్ చరణ్ కనిపించారు.పెర్ఫార్మెన్స్‌లను ప్రేక్షకులు చూసారు. “ఆర్.ఆర్.ఆర్” భారీ విజయంతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారాడు. ఐదో స్థానంలో టాలీవుడ్ నుంచి టాప్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు చోటు సంపాదించారు. 2022లో విడుదలయిన రెండు చిత్రాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. సమంతా రూత్ ప్రభు రెండు విభిన్నమైన సినిమా జోనర్‌లలో నటించారు. ఆమె తమిళంలో విడుదలైన ‘కాతువాకుల రెండు కాదల్’ రొమాంటిక్ డార్క్ కామెడీ అయితే, తెలుగులో ఆమె విడుదలైన ‘యశోద’ ఒక సంపూర్ణ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రాలతో ఆమెకు మరింత ఆదరణ పెరిగింది. ఆరో స్థానంలో బాలీవుడ్ టాప్ స్టార్ హృతిక్ రోషన్ నిలిచారు. 2019లో విడుదలైన ‘సూపర్ 30’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 2022లో ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌తో వెండితెరపై కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడకపోయినా, హృతిక్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకులను మెప్పించింది. ఇక ఏడవ స్థానంలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ నిలిచారు. కియారా అద్వానీకి 2022లో విడుదలైన రెండు చిత్రాలు ‘జగ్‌జగ్ జీయో’, ‘భూల్ భూలయ్యా 2′ భారీ హిట్‌గా నిలిచి ఆమెకు మరింత పేరును తెచ్చిపెట్టాయి. ఈ రెండు భారీ విజయాలతో ఆమె క్రేజ్ కూడా అమాంతంగా పెరిగింది. ఎనిమిదవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియన్ మూవీ ఆర్.ఆర్.ఆర్. భారీ విజయవంతం గ్లోబల్ స్టార్ గా మారాడు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్, ఆలియా భట్ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. 2022 సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒకే ఒక్క మూవీ విడుదల అయినప్పటికీ అతని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు ఏర్పడ్డారు. ఇక తొమ్మిదవ స్థానంలో కూడా మరో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నిలిచారు. 2022 సంవత్సరంలో అతను నటించిన చిత్రం ఏది కూడా విడుదల కానప్పటికీ 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ విజయంతో అతని క్రేజ్ అలాగే కొనసాగుతూ వస్తుంది. పుష్ప మూవీ ద్వారా పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. నార్త్ బెల్ట్ లో కూడా అతని క్రేజ్ మరింత పెరిగింది. ఇక పదవ స్థానంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ హీరో యష్ నిలిచారు. ఆ చిత్రంలోని రాకీ భాయ్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. కేజీఎఫ్ – చాప్టర్ 2’ 2022 సంవత్సరంలో భారీ ఓపెనింగ్ తో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ప్రీక్వెల్ కంటే పార్ట్- 2 చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం ద్వారా హీరో యష్‌ పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More