ఘోర పరాజయం తరువాత నైరాశ్యం లో ఉన్న వైసీపీ కి మరో దెబ్బ తగిలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. కేవలం పదకొండు సీట్లకు పరిమితమై బొక్క బోర్లా పడ్డ వైసీపీ నుంచి నుంచి గెలిచిన 4 గురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూటమి వైపు చూస్తున్నట్లు సమాచారం.. అందుతోంది..వైసీపీ పార్టీ, మరో BRS గా మారుతుంది అని భావించి ముందుగానే కూటమి లో భాగస్వామ్యం అవ్వాలని చూస్తునట్లు విశ్వాసనీయా వర్గాల సమాచారం….కూటమి వైపు చూస్తున్న ఆ నలుగురు ఎమ్మెల్యే లు ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.వైఎస్ జగన్ (పులివెందుల),పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), దాసరి సుధ (బద్వేల్), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), బూసినేవిరూపాక్షి (ఆలూరు) ,శివప్రసాద్ (దర్శి),తాటిపర్తి చంద్రశేఖర్(యర్రగొండపాలెం), రేగం మత్స్యలింగం(అరకు), మత్స్యరాస విశ్వేశ్వరరాజు (పాడేరు),ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట),పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి (తంబళ్లపల్లి) మొత్తం 175 స్థానాలకు మాజీ సీఎం సహా 11 అభ్యర్థులు గెలిచారు.. వైసీపీ పార్టీ నుంచి 11 మంది ఎమ్మెల్యే లుగా గెలిచిన అభ్యర్థులు ఉండగా అందులో 4 గురు అభ్యర్థులు కూటమి వైపు చూస్తుంటే వైసీపీ పరిస్థితి మరింత దారుణం గా మారనుందని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు..ఈ నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు లలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.. ఇదిలా ఉండగా బంపర్ మెజారిటీ తో ఉన్న కూటమి వీళ్ళని చేర్చుకుంటుందా..? లేదా అన్నది డౌటే.. 2014 లో ఇరవై ముగ్గుర్ని చేర్చుకుని తీవ్ర విమర్శల పాలైన కూటమి ఇప్పుడు అదే తప్పుని రిపీట్ చేయబోదని అంటున్నారు.. అంతకి అవసరం అయితే ఫుల్ స్వింగ్ మీదున్న కూటమి వారిని రాజీనామా చేసి రమ్మనే పరిస్తితులు ఉండొచ్చని అంటున్నారు.. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు కూల్ గా వున్నా పవన్ కళ్యాణ్, లోకేష్ ల నుండి వైసీపీ తీవ్రమైన రాగింగ్ ఎదుర్కొబోతుంది అన్నది మాత్రం కన్ఫర్మ్ అంటున్నారు..