Vaisaakhi – Pakka Infotainment

శ్రీచక్ర ఆకృతిలో ప్రపంచంలో అతిపెద్ద భౌద్దాలయం

హిందూ ధర్మం లో శ్రీ చక్రం విశిష్టత అద్వితీయం.. ఈ యంత్రం శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితా దేవి , త్రిపుర సుందరి అమ్మవార్లను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు శక్తిని సూచిస్తాయి. అందుకే శ్రీ చక్రం భిన్న దివ్యశక్తుల సంగమం. అలాంటి శ్రీచక్ర ఆకారంలో మేరు శిఖర ఆకృతి తో రూపొందించిన అపురూప ఆలయం ఇండోనేషియా సెంట్రల్ జావా లోని మాగెలాంగ్ లో ఉంది. 9వ శతాబ్దానికి చెందిన మహాయాన బౌద్ధ దేవాలయం. ఆరు చదరపు ప్లాట్‌ఫారమ్‌లతో కలిగి మూడు వృత్తాకార ఆకృతులతో 2,672 రిలీఫ్ ప్యానెల్‌లు 504 బుద్ధ విగ్రహాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రధాన గోపురం చుట్టూ 72 బుద్ధ విగ్రహాలు చిన్న చిన్న మందిరం వంటి స్థూపం లోపల నిక్షిప్తం చేశారు.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయమే కాకుండా ప్రపంచంలోని గొప్ప బౌద్ధ స్మారక కట్టడాలలో ఒకటి గా గుర్తింపు పొందింది. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో శైలేంద్ర రాజవంశం పాలనలో నిర్మించబడిన ఈ ఆలయం, ఇండోనేషియా దేశ జావానీస్ బౌద్ధ నిర్మాణ శైలిలో నిర్మించబడింది ఈ ఆలయం ఈ ప్రాంతంపై భారతదేశ కళా ఔన్నత్యాన్ని ప్రతిబింబించే శిల్ప సౌందర్యం మనల్ని మరోలోకానికి తీసుకువెళ్తుంది.. అయితే ఈ బోరోబుదూర్‌ ఆలయాన్ని ప్రత్యేకంగా ఇండోనేషియా దేశీయ కళగా తీర్చి దిద్దాడానికి స్థానిక కళా సంబంధ దృశ్యాలు, అంశాలు చేర్చి నిర్మాణం కొనసాగించారు. ప్రముఖ బౌద్ధ యాత్రా స్థలం గా గుర్తింపు పొందిన ఈ కట్టడం బౌద్ధ విశ్వోద్భవ శాస్త్రానికి ప్రతీకగా మూడు స్థాయిల ద్వారా పైకి చేరుకుంటుంది కామధాతు (కోరిక ప్రపంచం), రూపధాతు (రూపాల ప్రపంచం)మరియు అరుపధాతు (ది నిరాకార ప్రపంచం). ఈ మూడు అవస్థలను అందరికీ అర్ధమయ్యేలా మెట్లు, గోడలు ఫలకాలపై 1,460 చిత్రాలను చిత్రీకరించారు..ఇండోనేషియాలో, పురాతన దేవాలయాలను కాండి అని పిలుస్తారు అందువల్ల స్థానికులు “బోరోబుదూర్ టెంపుల్”ని కాండీ బోరోబుదూర్ గా వ్యవరిస్తారు.. శ్రీ యంత్రానికి ప్రాతినిధ్యం వహించే హిందూ మేరు రూపంలో తయారు చేయబడిన అతిపెద్ద బౌద్ధ మండలాకార దేవాలయం14వ శతాబ్ధ సమయంలో హిందూ రాజ్య వ్యవస్థ క్షీణించి జావాలోని ప్రజలు ఇస్లాం మతంలోకి మారడం వలన ఈ ఆలయం కాలక్రమేణా ఉనికి కోల్పోయిందని కొన్ని ఆధారాలు తెలుపుతున్నాయి. ఎన్నో ఒడిదుడుకులకు లోనైన ఈ అతిపెద్ద ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా లో చేరింది. కంబోడియాలోని అంగ్‌కోర్ వాట్ ఆగ్నేయాసియాలోని గొప్ప పురావస్తు ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందితే బోరోబుదూర్ దేవాలయం తీర్థయాత్ర క్షేత్రం గా గుర్తింపు పొందింది. ఇండోనేషియాలోని బౌద్ధులు ఈ స్మారక చిహ్నం దగ్గరే వెసాక్ డే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More