అందమైన బాపు బొమ్మతో చాలామంది అమ్మాయిల్ని పోల్చుతుంటారు ఆ పోలిక ఎందుకంటే చారడేసి కళ్ళు.. పొడుగాటి జడ.. ఈ రెండే బొమ్మాయి కి అందం.. పొడుగాటి జడ గురించి అనుకుంటే కంపల్సరీ గా ఈ ముచ్చట మనం తెలుసుకోవాలి.. జడ వేసుకోవడంలో అందం.. ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా దాగి ఉందట.. అర్రే.. జడకి ఆరోగ్యానికి లింక్ ఏంటి అంటారా..? జర జాగ్రత్తగా వినండి మనం జడ వేసుకునేటప్పుడు మూడు పాయలు తీస్తాం. ఈడ, పింగళి, సుషుమ్న, ఇవి ఆ మూడుపాయల పేర్లు.. మూడు నాడులకు సంకేతం.. ఇక హిందూ సనాతన ధర్మం లో దీనికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే వెన్నెముక సమాంతరంగా జడ చివరి వరకు సాగుతుంది.. శిరస్సుపై స్టార్ట్ అయ్యే జడ సహస్రార పద్మానికి సంకేతం మన నాడుల్లో రెండు నాడులు అంటే ఇడ, పింగళి పెనవేసుకుని ఉండగా మూడవ నాడి సుషుమ్న అంతర్లీనంగా ఉంటుంది. చాలా మంది మోడ్రన్ హెయిర్ స్టైల్ కో.. ఈజీ గా వుంటుందనో.. ఏ పోనీ టైలో.. లేకా జుట్టుని అలా లూజుగా వదిలేయడమో చేస్తుంటారు.. కానీ జడ లో దాగి వుండే అసలు మేటర్ ఏంటంటే స్త్రీలకు మాత్రమే వచ్చే కొన్ని వ్యాధుల నుండి స్వీయ రక్షణ కోసం ఈ జడ విధానాన్ని పూర్వికులు రూపొందించారు అన్నది అసలు సిసలు దేవ రహస్యం. మన పూర్వీకులు పెట్టిన ప్రతి ఆచారం లోను సంప్రదాయం లోను మనికి ఉపయోగ పడే పరమార్ధాన్ని దాచిపెట్టారన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు.
previous post
next post