ప్రముఖ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్ కి చెందిన వెల్పేర్ సంస్థలో డబ్బులు కట్టిన తమను గత ఏడేళ్లుగా తిప్పుతున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం చేయలేదని వెల్ఫేర్ గ్రూప్ బాధితులు రోడ్డెక్కారు.. విశాఖపట్నం లోని ఆశీలమెట్ట వద్ద ఉన్న వెల్పేర్ కార్యాలయం ఎదుట బాధితులంతా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు బాలజీ మాట్లాడుతూ మేమంతా గుడివాడ ప్రాంతం నుంచి వచ్చామని, ప్రతి నెల రైలులో వచ్చి వెళ్లడం తప్ప మేము కట్టిన డబ్బులకు మాకు న్యాయం చేయాలని కోరతున్నా సంస్థ వారు పట్టించుకోవడం లేదని, పాలసీలు కట్టిన మాకు ఇప్పటి వరకూ 70లక్షలు వరకూ చెల్లించాలని, తీరా ఇప్పుడు మీరు కట్టిన అసలు సొమ్ము మాత్రమే చెల్లిస్తామని, వడ్డీ ఏమి ఇవ్వలేమని చెబుతున్నారన్నారు.. మేము డబ్బులు చెల్లించి ఎనిమిది సంవత్సరాలు అవుతుందని. మేము చెల్లించిన డబ్బులకు డబుల్ అమౌంట్ ఇవ్వాల్సి ఉన్పప్పటికీ నేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు.. తక్షణమే మాకు సంస్థ ఎండీ, డైరెక్టర్లు స్పందిచి చెల్లించిన డబ్బులకు అసలు, వడ్డీ కలిపి ఇవ్వాలని, మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. గుడివాడ పోలీసు కంప్లైంట్ ఇచ్చిన ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదన్నారు…పోలీసులు ఎందుకు కేసులు కట్టడం లేదని నిమ్మకు నీరెక్కినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు… అదే విధముగా విశాఖలోని 3వ పట్టణ పోలీసులు కేసు కూడా నమోదు చేయడం లేదని తిరిగి మా పై బెదిరింపు లు పాల్పడుతున్నారన్నారు.
ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు… హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించాలని డిమాండ్ చేశారు.. న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం కోనసాగిస్తామన్నారు.కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని న్యాయం జరిగే వరకు ఎన్ని రోజులు అయిన సంస్థ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు
next post