రెండు తెలుగు రాష్ట్రల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది భానుడి భగభగలు నుంచి ఉపశనం కలిగించే విధంగామరో రెండు రోజులు వర్షాలు పడతాయని చెప్పింది. ఎండ వేడి, వడగాల్పులు తో తెలుగు రాష్ట్ర తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలకు అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ హెచ్చరిస్తూనే అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. మరో వైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
previous post