కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై చేసిన ఓ ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రకటన చేయడానికి తామే కారణం అంటూ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఎగేసుకుంటూ ముందుకు వచ్చేసాయి. ఆ క్రెడిట్ అంతా మాదేనని సోషల్ మీడియాలో అదరగొట్టాయి. కొందరు నేతలు అయితే ఒక అడుగు ముందుకు వేసి మీడియా పరంగా కూడా గొప్పలు పోయారు. కానీ ఒక్క రోజులొనే సీన్ అంతా రివర్స్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసి వీరి ప్రగల్బాలపై నీళ్లు చల్లింది. ప్రస్తుతం ఇదే టాపిక్ పై చర్చ జరుగుతుంది. ఆంధ్రోళ్ల కు మరి ముఖ్యం గా విశాఖ ప్రజలకు ఇలా ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ నేతలు ఎదురుదాడికి సిద్ధమయ్యారు. ఒక్క రోజు వ్యవధిలోనే మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ అధికారులు, కార్మిక సంఘాలతో మాట్లాడిన కేంద్ర ఉక్క సహాయ మంత్రి ఫగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లడం లేదని ప్రకటించారు. దీంతో ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది అనుకున్నారు అంతా.కానీ 24 గంటల్లోనే కేంద్రం మనసు మార్చుకుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకణపై క్లారిటీ ఇచ్చింది. విశాఖ ప్రైవేటీ కరణ ఆపే ప్రసక్తే లేదని తేల్చేసింది. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రయ కొనసాగుతుందని అన్నారు. అయితే ఒక్క రోజు వ్యవధిలోనే కేంద్రం రెండు స్టేట్ మెంట్లు ఎందుకు మార్చింది. నిన్న ఒకటి మాట్లాడి నేడు మరొక ప్రకటన ఎందుకు చేసిందంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కేంద్ర మంత్రి ముందుగా చేసిన ప్రకటన తర్వాత రాజకీయ పార్టీలన్నీ తమ ఘనతేనని ప్రకటించుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు అయితే కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగి వచ్చిందని ప్రకటించారు. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ తాము విశాఖలో విజయోత్సవాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సైతం ఈ క్రెడిట్ తెలంగాణ సీఎం కేసీఆర్ దే అంటూ ట్వీట్ చేశారు. ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాగ్ స్టీల్ ఈఓఐలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని , ఆర్.ఐ.ఎన్.ఎల్ ని బలోపేతం చేయాలని ఆలోచించడానికి కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం బిడ్‌లో పాల్గొనాలి.” అని లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి ప్రకటన తరువాత పవన్ కళ్యాణ్ సైతం తమ కారణంగానే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కేంద్ర పెద్దలకి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇటు వైసీపీ నేతలు, అటు స్థానిక బీజేపీ నేతలు సైతం.. కేంద్రం ఇలాంటి ప్రకటన చేసినప్పుడు ముందు తమతో చెప్పి ఈ ప్రకటన చేస్తే ఆ క్రెడిట్ తమకు దక్కేదని ఎన్నికల్లో కచ్చితంగా ఎన్నికల్లో ప్లస్ అయ్యేదని కేంద్ర పెద్దలకు చెప్పిట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గడిచిన రెండు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఉక్కు శాఖ తాజాగా శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఆర్ఐఎన్ఎల్ పెట్టుబడుల మీడియా నివేదికల్లో నిజం లేదని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పురోగతిలో ఉందని ప్రకటించింది. ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపరచడానికి మాత్రమే మద్దతు ఇస్తున్నామని త్వరలో ప్రైవేటీకరణ పూర్తి అవుతుందని తెలిపింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో వాటాల ఉపసంహరణ ప్రకియపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని,ఆపడానికి కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. డిజిన్విస్టె మెంట్ ప్రక్రియ కొనసాగుతుదని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశారని వివిద పత్రికల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగానే ఈ వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ప్రచారం చేస్తున్నాయి. తమ వల్లేనని చెప్పుకుంటున్నాయి. అయితే వాస్తవంగా చెప్పుకుంటే మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చాలా లీగల్ సమస్యలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములను ఇచ్చిన ప్రజలకు అప్పటి ప్రభుత్వం లీగల్ గా జరిగిన ఒప్పందంలో ఆ భూములను ప్రభుత్వం నిర్వహించే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అందులో ఎక్కడ ప్రైవేటీకరణ అనే ఊసే కనిపించలేదు. చట్టపరంగా చేసిన ఒప్పందాల మేరకు స్టీల్ ప్లాంట్ నిర్వహణ కొనసాగాలి. నిబంధనలు గాలికొదిలి ఇప్పుడు దానిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తాం అంటే కుదరని పనిని చాలా మంది మేధావులు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వైశాఖి దాట్ కామ్ ఫిబ్రవరి లొనే ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇక రానున్న ఎన్నికల దృష్ట్యా అటు కేంద్ర బిజెపి ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ పై మైండ్ గేమ్ ఆడుతున్నాయన్నది సుస్పష్టం. అటు కార్మికులను ఇటు ప్రజలను వివాదాస్పద వ్యాఖ్యలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకొని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
previous post
next post