జరిగిన ఎన్నికల్లో ప్యాన్ గాలి బ్రహ్మాండంగా వీంచిందని వైఎస్ జగన్ మళ్లీ గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి గా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స దంపతులు జోస్యం చెప్పారు..మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్ లో పాల్గొన్నారని తమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేసినట్లు పేర్కొన్నారు.. ఎన్నికల్లో టిడిపి ఎన్నో కుట్రలు కుతంత్రాలు తెరలేపి సంక్షేమ పథకాలను అడ్డుకుందన్నారు.ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతి పక్షాలు తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ఆ మాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదని సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారని అన్నారు.ఓటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బొత్స దంపతులు ధన్యవాదాలు తెలిపారు..
previous post