Vaisaakhi – Pakka Infotainment

నంబర్ వన్ యూట్యూబర్ గా విశాఖవాసి అన్వేష్

” నమస్తే ఫ్రెండ్స్

నా పేరు అన్వేష్ నేను ప్రపంచ యాత్రికుడిని వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని ” అంటూ మొత్తం 85 దేశాలను చుట్టేసి వాటిని మన కళ్ళ ముందు ఉంచి నెంబర్ వన్ యూట్యూబర్ గానే కాకుండా ఆదాయంలో కూడా నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు విశాఖకు చెందిన అన్వేష్. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం భీమిలిలో నిరుపేద కుటుంబంలో పుట్టిన అన్వేష్ ఉన్నత విద్యని అభ్యసించాడు. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేసి ఆ తరువాత ఎంబీఏ కోర్సు చేశాడు. అనంతరం హోటల్ మేనేమెంట్ చేసి, గోవాలో టూరిస్ట్ గైడ్‌గా వర్క్ చేశారు. టూరిస్ట్ గైడ్‌గా ఇండియాలోనే వర్క్ చేసిన తర్వాత ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కూడా టూరిస్ట్ గైడ్‌గా పనిచేశారు. ఆ అనుభవంతోనే ఇప్పుడు ఇతను ప్రపంచ యాత్రికుడిగా మారి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు.ఒక్కో వీడియోకు లక్షల్లోనే సంపాదిస్తున్నాడు.సుమారుగా అతని వీడియోను సుమారుగా 20 లక్షల మంది చూస్తున్నారంటే అంటే అతిశయోక్తి కాదు. ఈ వీడియోలను వీక్షించే వారిలో ఎక్కువగా ఎన్నారై లే ఉండడం గమనార్హం. యూట్యూబ్ ఛానల్‌ని 2019లో ప్రారంభించిన 8 నెలలకు మానిటైజేషన్ అయ్యింది. అంటే డబ్బులు రావడం స్టార్ట్ అయ్యింది. ఆ నెలలో యూట్యూబ్ ద్వారా అతనికి 150 డాలర్లు వచ్చాయి. అంటే పది వేల రూపాయిలు అతని మొదటి నెల సంపాదన. ఆ తరువాత కొన్నాళ్ళ వరకు పెద్దగా ఆదాయం రాలేదు. కానీ 2021 జూన్‌లో 6,300 డాలర్లు వచ్చాయి. అంటే ఐదు లక్షల రూపాయిలు వచ్చాయి. అదే అతనికి యూట్యూబ్ ద్వారా వచ్చిన హయ్యెస్ట్ అమౌంట్. ఆ ఐదు లక్షలతో దుబాయ్ వెళ్లి ఐఫోన్‌లు డ్రోన్‌లు వీడియోల కోసం యూట్యూబ్ నిర్వహణ కోసం తనకు కావాల్సిన వాటిని కొనుక్కున్నాడు. ఆ తరువాత 2022 జూన్‌లో మళ్లీ అతని ఆదాయం మరింత రెట్టింపు అయింది 15,000 డాలర్లు అంటే అంటే దాదాపు 10 లక్షలు వచ్చాయి. వాటితోనే అతను ప్రపంచ యాత్ర ప్రారంభించాడు. ప్రారంభంలో కొన్ని ప్రదేశాలు తిరిగి ఆ వీడియోలు అప్ లోడ్ చేయడం వల్ల వచ్చింది లక్ష రూపాయిలు మాత్రమే. ఖర్చు మాత్రం చాలా ఎక్కువే అయ్యింది. కానీ అదే నెలలో ఊహించని విధంగా చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది. కానీ ఇప్పుడు అతని ఆదాయం నెలకి రూ.30 లక్షల సంపాదన అంటే ఆశ్చర్య పోవాల్సిందే. ఒక యూట్యూబ్ ఛానల్‌కి రూ.30 లక్షల ఆదాయం అంటే ఇది నిజంగానే నమ్మశక్యం కాని విషయమే కానీ లెక్కలతో సహా ఇది నమ్మాల్సిన విషయమే అంటున్నాడు మన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అవినాష్.జూలై నెలలో రూ.30 లక్షలు సంపాదించడం ద్వారా అత్యధిక ఆదాయం పొందిన యూట్యూబర్‌గా ఈ ప్రపంచ యాత్రికుడు రికార్డుల కెక్కాడు. ఆదాయంలో తెలుగులో టాప్ యూట్యూబర్స్‌ని సైతం వెనక్కి నెట్టాడు. ఆదాయం పరంగా వాళ్లు ప్రపంచ యాత్రికుడికి దరిదాపుల్లో కూడా లేకపోవడం విశేషం. నెలకి 30 లక్షలా అని చాలామంది ముక్కున వేలుసుకుంటున్నారు. కొంతమంది నా అన్వేష్ లా లక్షలు సంపాదించవచ్చని మొబైల్స్ పట్టుకుని బయలుదేరారు. తెలుగులో అప్పుడే ఇందుకు సంబంధించి ప్రత్యేక కోర్సులు అంటూ ప్రారంభించేసారు కూడా. అన్వేష్ లా నెలకు 30 లక్షలు సంపాదించండి అంటూ బోర్డులు పెట్టి ప్రచారాలు చేసేస్తున్నారు. డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. అందుకే చాలా మంది కూడా ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.ఈ ప్రత్యేక కోర్సుల పేరిట వ్యాపారం చేస్తూ చాలా మంది నిరుద్యోగులను మోసం చేస్తున్న సంస్థలు ఎక్కడికక్కడ వెలుస్తున్నాయి.అన్వేష్ భీమిలి నుంచి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి నేడు ఒక పెద్ద యూట్యూబర్ గా ఎదిగాడంటే అది మామూలు విషయం కాదు. అదేమీ ఒక్కరోజులోనో.. ఒక్క గంటలోనో.. లేక ఒక వీడియోతోనో వచ్చిన పేరు కాదు.ఆ స్థాయికి రావడానికి అతను ఎంతో శ్రమించాడు.ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి తెలుగు వాళ్లకు ప్రపంచాన్ని చూపించాలని ఆశయంతో అన్ని దేశాలు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా చైనా సిరీస్ లో దేశద్రోహి అంటూ పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సిరీస్ లో చాలామంది అతనిని టార్గెట్ చేస్తూ బూతులు తిట్టడమే కాకుండా, దేశద్రోహి అంటూ వరుసగా కామెంట్లు చేస్తూ విరుచుకుపడ్డారు. అయినా అతను వెనక్కి తగ్గకుండా తన చూపించాల్సిన ప్రాంతాలను, చెప్పాల్సిన విషయాలను చెప్పాడు. విషయం ఏంటంటే ఆ చైనా సిరీస్ తర్వాతే అతనికి 30 లక్షలు వచ్చాయి. వాస్తవానికి 50 లక్షలు రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలవల్ల 30 లక్షలు మాత్రమే అతనికి వచ్చాయని ఒక సందర్భంలో అన్వేషే తెలియజేశాడు. చాలామంది యూట్యూబర్ల లకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉంటారు కానీ వ్యూస్ తక్కువగా వస్తుంటాయి. నా అన్వేష్ కు వారితో పోలిస్తే సబ్స్క్రైబర్లు చాలా తక్కువ కానీ వ్యూస్ లక్షల్లో వస్తుంటాయి.దీనికి కారణం ఇంటర్నేషనల్ కంటెంట్ తో అతని ప్రతి వీడియో ఉండటం వలన సుమారు 165 దేశాల ప్రజలు ఇతని వీడియోలను తప్పనిసరిగా చూస్తూ ఉంటారు. ఒక వీడియో అప్లోడ్ చేస్తే సుమారు 10 నుంచి 20 లక్షలు మంది చూస్తూ ఉండటం జరుగుతుంది. ప్రస్తుతం ‘నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్‌కి కేవలం 1.33 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లే ఉన్నారు. ఒక రకంగా తక్కువ సబ్‌స్క్రైబర్‌లు ఉన్నప్పటికీ ఆదాయంలో మాత్రం ఈ ప్రపంచ యాత్రికుడే తోపు అనే చెప్పాలి.చైనా సీజన్ హిట్ కావడంతో ఈనెల నాకు రూ.30 లక్షల ఆదాయం వచ్చింది. తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ ఈ ప్రపంచ యాత్రికుడిదే హయ్యెస్ట్ రెవెన్యూ తెలుగులో ఎంటర్ టైన్మెంట్ కానీ, న్యూస్ కానీ, టెక్ కానీ,ఇలా ఏ కేటగిరీలో చూసుకున్నా అందరికంటే ముందు ‘నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్‌’ టాప్‌లో ఉంది. ఈ నాలుగేళ్ల నా జర్నీలో చైనా సీరీస్ హిట్ అయినట్టుగా ఏ సీరీస్ హిట్ కాలేదని అన్వేష్ చెప్పాడు. ఈ సీరీస్‌కి ఇంత ఎక్కువగా డబ్బులు ఎలా వచ్చాయంటే నిజానికి సెలబ్రిటీలు, హోమ్ టూర్‌లు ఆ టూర్లు ఈ టూర్లు, ఇంటర్వ్యూలు ఇలా చాలా వీడియోలు పెడతారు. వాటికి మిలియన్లలో వ్యూస్ వస్తాయి. కానీ డబ్బులు మాత్రం వేలల్లోనే ఉంటుంది. అదే రెండు మూడు మిలియన్ల వ్యూస్ నాకు వస్తే మూడు నుంచి నాలుగు లక్షలు వస్తాయి. కారణం ఏంటంటే నా సబ్‌స్క్రైబర్‌లు. నా సబ్‌స్క్రైబర్‌లు భారతదేశంలో ఫిఫ్టీ పర్సంట్ ఉంటే, మిగిలిన ఫిఫ్టీ పర్సంట్ ఎన్ఆర్ఐలు ఉన్నారని తెలియజేస్తున్నాడు. తనకు వచ్చిన 30 లక్షలకు సంబంధించిన స్పందిస్తూ నాకు చాలా హ్యాపీగా ఉందని, నేను రూ.30 లక్షలు సంపాదించానని గర్వంగా చెప్తున్నా, నేను నిజాయితీగా చెప్తున్నా. నా సబ్‌స్క్రైబర్‌ల వల్ల ఇంత డబ్బు వచ్చింది కాబట్టి వాళ్లకి చెప్పడంలో తప్పులేదు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వచ్చింది కాబట్టి టాక్స్ కట్టాలి కడతాను. ఇండియన్ గవర్నమెంట్‌కి కట్టాలి, అమెరికన్ గవర్నమెంట్‌కి కట్టాలి రెండింటికీ కడతాను. ఆడదాని వయసు.. మగాడి సంపాదన చెప్పకూడదని అంటారు. కానీ నేను విరుద్ధం కాబట్టి నా సంపాదన గురించి ఇంత పబ్లిక్‌గా చెప్తున్నాను. నిజానికి నేను ఒక నెలలో సంపాదించాల్సింది రూ.30 లక్షలు కాదు. రూ.50 లక్షలు కానీ, ఓ రూ.20 లక్షలు తగ్గిందని అన్వేష్ చెప్పాడు. 167 దేశాల్లో నా వీడియోలు చూస్తారు. రూ.30 లక్షల్లో రూ.15 లక్షల ఎన్ఆర్ఐల వల్లే వచ్చాయి.167 దేశాల్లో నా వీడియోలు చూస్తారు. రూ.30 లక్షల్లో రూ.15 లక్షల ఎన్ఆర్ఐల వల్లే. నాకు ఎన్ఆర్ఐ అకౌంట్ ఉంది కాబట్టి ఇండియాకి రూపాయి టాక్స్ కట్టాల్సిన పనిలేదు. కానీ నా ధర్మం ప్రకారం ఇండియా అకౌంట్‌కే అమౌంట్ పడుతుంది. ఇండియాకే టాక్స్ కడుతున్నా’ అని తన యూట్యూబ్ రెవెన్యూకి సంబంధించిన రహస్యాలను తెలియజేశాడు ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ యూట్యూబర్. అయితే అన్వేష్ కు వచ్చిన ఆదాయాన్ని చూసి చాలామంది మొబైల్ ఫోన్లు పట్టుకొని తాము కూడా అంత సంపాదించాలని బయలుదేరారు. ఇది ఎలా ఉందంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందాన కనిపిస్తుంది. అయితే కష్టపడితే ఎప్పటికైనా ఆ స్థాయికి చేరుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తం సంపాదించాలని బయలుదేరితే అసలుకే ఎసరు వస్తుంది. కరోనా సమయంలో చాలామంది యూట్యూబర్లు బాగా సంపాదించారు. కరోనా తర్వాత వారి వీడియోలకు వ్యూస్ బాగా తగ్గిపోయి వెనుకబడి పోయారు. తన అన్వేష్ మాత్రం ఇంటర్నేషనల్ కంటెంట్ తో నంబర్ వన్ తెలుగు యుట్యూబర్ గా దూసుకుపోతున్నాడు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More