విశాఖ లోని శారదా పీఠం స్వరూపానంద సరస్వతి కి ప్రస్తుతం ఇస్తున్న ఎక్స్ కేటగిరి వన్ ప్లస్ వన్ గన్ మాన్లను వెనక్కి తీసుకోమని ఏపీ డీజీపీకి, విశాఖ పోలీస్ కమిషనర్ కు శ్రీ విశాఖ శారదాపీఠం.. తరపున లేఖ అందింది. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న స్వామీజీ కి
2019 నుండి స్వామీజీకి ఎక్స్ కేటగిరి భద్రత ని అప్పటి జగన్ సర్కార్ అందించింది. అయితే రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వానికి స్వామి అనుకూలంగా మాట్లాడినా ప్రభుత్వం గాని కూటమి నేతలు గాని పాజిటివ్ గా స్పందించలేదు. అలాగని భద్రత ను తొలగించలేదు.. ఇటీవల గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం శారదా పీఠానికి కేటాయించిన భూముల జీఓ ను రద్దు చేసింది. అలాగే తిరుమల గోగర్భం డ్యామ్ సమీపంలో నున్న శారదా పీఠం అవకతవకలపై వచ్చిన పిర్యాదు ను స్వీకరించింది.
ఇటీవల జరిగిన స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖ లో ఇదే చివరి పుట్టినరోజు అని స్వరూపానంద సరస్వతి ప్రకటించడం ఇప్పుడు గన్ మెన్ ల భద్రత వద్దనుకోవడం చర్చ కు దారి తీసింది. ఇకపై స్వామీజీ ఎక్కువ సమయం
రిషికేశ్‌లో తపస్సు కే కేటాయించాలన్న నిర్ణయం నేపథ్యంలో, ఇకపై ఎక్స్ కేటగిరీ రక్షణ అవసరం లేదని ప్రభుత్వానికి లేఖ పంపింది. శ్రీ విశాఖ శారదా పీఠం.. ఇంతవరకు తన భద్రత కోసం ఆలోచించిన రెండు ప్రభుత్వాలకు స్వామిజీ ఆ లేఖ లో కృతజ్ఞతలు తెలియజేసారు..