మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారు ప్రమాణస్వీకారం రాజధాని విశాఖ లొనే చేయనున్నారని మంత్రి బొత్స ప్రకటన చేయడం , ఇప్పటికే జూన్ 11 న చంద్రబాబు నాయుడు అమరావతి కి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ రాజధాని అంశం తెరపైకి వచ్చింది.. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అమరావతి, వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని కావడం ఖాయం.. ఈ టైం లో విశాఖ రాజధాని విషయంపై పాత అంశం ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.. మద్రాస్ నుంచి తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం గా అవతరించిన తరువాత అప్పటి పెద్దలు విశాఖనే శాశ్వత రాజధాని ఎన్నుకున్నారన్న విషయం చాలామందికి తెలియని తెలీదు. విశాఖను శాశ్వత రాజధానిగా అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 1953 లోనే శాసనసభలో ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా 61 ఓట్లు, ప్రతికూలంగా 58 ఓట్లు రాగా 20 మంది తటస్థంగా చాలామంది ఉండిపోయారు. ఈ నెగ్గిన తీర్మానం ప్రకారం 1956 ఏప్రిల్ 1 నుంచి విశాఖపట్టణం రాజధానిగా పరిపాలన ప్రారంభం కావాలనీ, అప్పటి వరకు కర్నూల్ రాజధానిగా కొనసాగుతుందని తీర్మానించారు. రొక్కం లక్ష్మీనరసింహం ప్రవేశపేట్టిన సవరణకు అనుకూలంగా జరిగిన తీర్మానాన్ని అప్పటి స్పీకర్ పల్లంపాటి వెంకట్రామయ్య అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన మొదటి శాసన సభా సమావేశం కూడా విశాఖలోనే ఆంధ్ర యూనివర్సిటీ టీ ఎల్ ఎన్ సభా హాలు లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన తీర్మానానికి 22 సవరణలు ప్రతిపాదించారు..
previous post