ఈ ఏడాది చివరి నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్ళు పట్టాలు ఎక్కనున్నాయి.. మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ గా 2019లో ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్ళు 2024 నాటికి, వివిధ మార్గాల్లో 102 సర్వీసులతో మొత్తం 51 రైళ్లు నడుస్తున్నాయి, ప్రయాణ వేగం లోనూ , సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో నిబద్ధతను ప్రతిబింబిస్తూ 2030 నాటికి 800 వందే భారత్ రైళ్లను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ రైల్వే స్లీపర్ క్లాస్ రైళ్ళు నడిపేందుకు ప్రణాళిక ను సిద్ధం చేసింది.
సెప్టెంబరు 20 నాటికి బెంగుళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) ప్లాంట్ నుండి స్లీపర్ క్లాస్ మొదటి రైలు పంపబడుతుందని చెన్నై ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF), జనరల్ మేనేజర్ యు.సుబ్బారావు ఓ ఆంగ్ల పత్రిక కు తెలియజేశారు.. సెప్టెంబర్ 20 నాటికే మొత్తం కోచ్‌లన్నీ చెన్నైలోని ICFకి చేరుకుంటాయని తరువాత రేక్ ఫార్మేషన్, ఫైనల్ టెస్టింగ్ & కమీషనింగ్ చెయ్యడానికి 15-20 రోజులు పడుతుందని ఆయన వివరించారు.. అన్ని ట్రయల్స్ పూర్తికాడానికి మరో రెండునెలలు పట్టే అవకాశం వుందని ఆ తరువాతే లక్నోకు చెందిన రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) పర్యవేక్షణ. హైస్పీడ్ టెస్టింగ్ కోసం నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
వందే భారత్ స్లీపర్‌తో, భారతీయ రైల్వే తన ప్రయాణీకులకు ఐరోపాలోని నైట్‌జెట్ స్లీపర్ రైళ్ల మాదిరిగానే రాత్రిపూట ప్రయాణాల్లో ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించాలని యోచిస్తోంది. “లైటాఫ్‌లో ఉన్నప్పుడు రాత్రిపూట వాష్‌రూమ్‌కి వెళ్లే ప్రయాణీకుల కోసం నిచ్చెన క్రింద ఫ్లోర్ ఎల్ ఈ డి స్ట్రిప్స్ ఉంటాయి. అలాగే రైలు అటెండెంట్ల కోసం ప్రత్యేక బెర్త్‌లు కూడా ఉంటాయన్నారు..
ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైలు నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, పశువులుఢీ కొట్టినా తట్టుకునేలా ఫ్రంట్ ఎలివేషన్ని మరింత బలోపేతం చేస్తున్నారు.. ఇతర ఫీచర్లలో స్టెయిన్‌లెస్ స్టీల్ కార్ బాడీలు, GFRP ఇంటీరియర్ ప్యానెల్‌లు, ఏరోడైనమిక్ డిజైన్, మాడ్యులర్ ప్యాంట్రీ, ఫైర్ సేఫ్టీ కంప్లైయెన్స్ (EN 45545), డిఫరెంట్-ఏబుల్డ్ ప్యాసింజర్‌ల సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, సెన్సార్ ఆధారిత ఇంటర్‌కమ్యూనికేషన్, ఫైర్ బారియర్ డోర్లు ఉన్నాయి. , ఎర్గోనామిక్ టాయిలెట్ సిస్టమ్‌లు, USB ఛార్జింగ్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్లు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌లు మరియు లగేజ్ రూమ్‌లను అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేస్తూ ప్రయాణీకుల భద్రత కు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా వందే భారత్ స్లీపర్ ట్రెయిన్ రూపొందుతుంది.