ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కోట్లను కుమ్మరిస్తున్నారు. ఓటుకు రేట్ ఫిక్స్ చేసి గుట్టు చప్పుడు కాకుండా నగదు మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమం మొదలైనట్లు తెలుస్తుంది. సర్వే లు రకరకాల అభిప్రాయాలతో ముందుకొస్తున్న తరుణంలో అన్ని సీట్లలో విజయం సాధించి సత్తా చాటాలని వైసీపీ ఫిక్స్ అయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలందరికి సూచాయిగా ఆదేశాలను జారీ చేశారు. ప్రతిపక్ష పార్టీలకు ఒక్క సీటు కూడా వెళ్లకుండా అన్ని సీట్లు కూడ తమ ఖాతాలోకి రావాలని స్థానిక నాయకులు సహకారంతో సమన్వయంతో కలిసి పనిచేసేలా ముందుకు వెళుతుంది. అటు ప్రధాన ప్రతిపక్ష టిడిపి పార్టీ అలాగే బీజేపీ, వామపక్ష పార్టీలు కూడా తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ పార్టీలు కూడా గెలిచే అభ్యర్థులకే అవకాశాలు ఇవ్వడం జరిగింది. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖలో మాత్రం పార్టీల మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. వైసిపి నిర్వహించిన అంతర్గత సర్వేలో ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలియడంతో ఆ పార్టీ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందు ఉంది. ఇక ఇటు బిజెపి అభ్యర్థి అటు టిడిపి అభ్యర్థి కూడా గెలుపు గుర్రాలం తామేనని ప్రకటించేసుకున్నారు. గెలుపు పై ఎవరికి వారు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత హీట్ ను పెంచాయి. వైసిపి, టిడిపి, వామ పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల బరిలో ఉండటంతో ఇక్కడ పోరు మరింత రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమాలకు చాలా రోజుల ముందే తెర లేపారు. ఓటుకు ఒక రేటు ఫిక్స్ చేసి గుట్టు చప్పుడు కాకుండా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం ఇచ్చిన వదులుకోకుండా ప్రజలతోనే ఉంటూ గెలిస్తే తాము చేయబోయే అభివృద్ధిని డంకా బజాయించి చెబుతున్నారు. ఈసారి ఇక్కడ మాత్రం పోటా పోటీగా కాకుండా ఏకపక్షంగానే ఎన్నికలు జరుగుతాయన్నది విశ్లేషకుల అంచనా.
previous post
next post