అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకునే వ్యక్తులు అకాల మరణాన్ని ఎదుర్కొంటారని ముప్పై సంవత్సరాల పై నుంచి జరుగుతున్న ఓ అధ్యయనం బయట పెట్టింది..అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ (UPF) అనేది సహజ ఆహారం సేకరించిన లేక సేంద్రీయ సమ్మేళనాల నుంచి పీజర్వేషన్ పూరిత తినదగ్గ ఆహారం. ఉత్పాదక ఉత్పత్తులు అత్యంత లాభదాయకంగా , సౌకర్యవంతంగా మరియు హైపర్‌పలేటబుల్‌గా రూపొందించబడ్డాయి రంగు రుచి వంటి ఆహార సంకలనాల తో మన కిచెన్ లో సాధారణంగా కనిపించని ఆహార పదార్థాలు.చక్కెర తో పాటు కృత్రిమంగా తీయబడిన పానీయాలు అధికంగా ఉన్న ఇలాంటి ఆహారాలు ఎక్కువగా తిన్నవారు ముందస్తు మరణానికి గురయ్యే ప్రమాదం 9% పెరిగిందని ఈ అధ్యాయనం పేర్కొంది.హార్వర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన ఈ అధ్యయనం లో ముప్పై సంవత్సరాలు పైబడ్డ 1,14,000 మంది శాంపిల్స్ తో రీసెర్చ్ చేసి అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (UPF) తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను హైలైట్ చేసింది.అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వలన ప్రాణాపాయం కొంచెం ఎక్కువగా ఉంటుందని తినడానికి సిద్ధంగా ఉన్న మాంసం, పౌల్ట్రీ మరియు సీఫుడ్-ఆధారిత ఉత్పత్తులు, చక్కెర పానీయాలు, పాల ఆధారిత డెజర్ట్‌లు మరియు అధిక ప్రాసెస్ చేయబడిన అల్పాహారం వంటివి ఈ జాబితాలోకి చేర్చబడ్డాయని ఆ నివేదిక లో వివరించారు.
previous post