టర్కీ, సిరియా దేశాలలో భారీ విధ్వంసం కొనసాగుతుంది. వందలాదిమంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్ర గాయాలతో అల్లాడుతున్నారు. పిల్లలు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా అందరినీ ఈ విధ్వంసం తుడుచుకుపెట్టుకుపోయింది. సోమవారం తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకు మూడుసార్లు టర్కీ, సిరియా దేశాల్లో వరుసగా భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. వేకువ జామున 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించగా, మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. తాజాగా 6.0 తీవ్రతతో మూడో భూకంపం వచ్చి ఆ దేశాలను అతలాకుతలం చేసింది. 12 గంటల వ్యవధిలో మూడు భారీ భూకంపాలు సంభవించడంతో ఆ దేశాల ప్రజలు ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన వరుస భూకంపాలలో సుమారు ఐదు వేల మందికి పైగా మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్టు గుర్తించారు. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భూకంప బాధిత దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టర్కీకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించింది. వైద్యబృందాలు, ఔషధాలను కూడా పంపించింది
previous post