చాలాకాలం తర్వాత తెలంగాణ పసుపు బారింది పచ్చజెండాల రెపరెపలు..హోర్డింగ్ ల హాడవిడి.., కార్యకర్తల కేరింతలు ప్రజల నీరాజనాలు.., తెలుగుదేశం పార్టీకి కొత్త జోష్ ని ఇచ్చింది.. ఖమ్మం లో ప్రతిష్టాత్మంగా నిర్వహించిన విజయ శంఖారావం బహిరంగ సభ సూపర్ సక్సెస్ తో తెలంగాణ తెలుగు తమ్ముళ్లు లో మళ్లీ కదలిక మొదలైంది చంద్రబాబు ఆసక్తికర ఉపన్యాసం., తెలంగాణలో చేసిన అభివృద్ధి, మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలన్న కొంతమంది వాదనను పిచ్చి ప్రయత్నంగా ప్రస్తావించడం ఇలా ఒకటేమిటి టిటిడిపి కి అన్ని అలా కలిసి వచ్చేసాయి. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ తర్వాత ప్రత్యర్థి పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య నలిగిపోయి పతనం దిశగా పయనిచ్చింది. ఎన్నో స్వయంకృతాపరాధరాలు… మరెన్నో విఫల ఆలోచనలు.. పార్టీని కోమాలోకి నెట్టేసాయి. రాజకీయాల్లో వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప వ్యవస్థ ప్రయోజనాలు, సిద్ధాంతాలు ఏమాత్రం పట్టని నేతలు అవకాశం ఉన్న పార్టీలో ఇమిడిపోయి సర్దుకుంటారు.. టిడిపిలోనూ అదే జరిగింది అయితే పార్టీకి ఉన్న బలం పార్టీని విపరీతంగా నమ్మిన క్యాడర్ మాత్రం చెదిరిపోలేదు నాయకులు లేని పార్టీకి కేడర్ బలంగా ఉండటమే ఈరోజు టీటీడీపీకి కలిసి వచ్చిన అంశంగా మారింది. క్లిష్ట సమయంలో టీటీడీపీ పగ్గాలు అందుకున్న కాసాని జ్ఞానేశ్వర్ పార్టీని నడిపించడాన్ని సీరియస్ గానే తీసుకున్నారు బలమైన బీసీనేత కావడం ఆర్థికంగా సుస్థిరంగా ఉండడం అన్ని పార్టీల్లో ఆయన్ని అభిమానించే వర్గం ఉండడం ఇలా ఎన్నో టిడిపికి కలిసి రాగా ఇన్నాళ్లు ప్రాంతీయ పార్టీగా ఉండి తెలుగుదేశాన్ని ఏ స్థాయిలోను ఎదగనివ్వకూడదని అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ స్థాయికి ఎదగాలని భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించడం టిడిపికి పూర్తిస్థాయి బలాన్ని ఇచ్చింది. కాసాని బాధ్యతలు స్వీకరించిన వెంటనే నియోజకవర్గాల వారీగా అక్కడ నేతలు కార్యకర్తలతో సమీక్షలు జరిపి పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం.. మొదట బహిరంగ సభకు ఖమ్మం ప్రాంతాన్ని ఎంచుకోవడం.. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం.. అంతా కాసాని వ్యూహం ఫలించేలా చేసింది ఇలాగే వెళ్తే త్వరలో టిటిడిపీలో చేరికలు కూడా ఉండొచ్చన్న ఆశాభావాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ పార్టీని నమ్ముకున్న నేతలు అందరూ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పటికే బీఆర్ఎస్ కు వెళ్లి ఇమడలేక, ఉండలేక, ఉక్కుపోతకు గురవుతున్న టిడిపి మాజీ నేతలు కొంతమంది తిరిగి సొంతగూటికి వస్తారని వారి రాకతో పార్టీకి తిరిగి పూర్వవైభవం ఖాయమని ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాసాని రాక తెలంగాణ తెలుగుదేశం కి కలిసి వచ్చిందనే చెప్పాలి ఇదే ఊపుతో వెళితే తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం కాకపోయినా పరువు దక్కించుకున్న పార్టీగా నైనా మిగులుతుందని విశ్లేషకుల వ్యాఖ్య.
previous post