సైబర్ కేటుగాళ్ళు రూటు మార్చారు.. టెక్నాలజీని అడ్డంగా వాడేసి అడ్డదిడ్డంగా సంపాదించడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. అందుకు ఏకంగా నకిలీ తిరుమల వెబ్ సైట్ ని సృష్టించి దోచుకోవడం మొదలుపెట్టారు.. శ్రీవారి దర్శనంతో పాటు అకాండేషన్, ఇతర ఆర్జిత సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్న వారే టార్గెట్ గా వలవేస్తున్నారు.. దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అపారం. తిరుపతికి వెళ్లడం అంటే ప్లానింగ్ తో కూడిన పెద్ద పని. రెండు మూడు నెలల ముందు నుంచే రైలు టికెట్లు మొదలు దర్శనం టికెట్లు, రూమ్స్ బుకింగ్, ఆర్జిత సేవల వరకు అన్నింటినీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటుంటాం. గతంలో కంటే ఇటీవల శ్రీవారి దర్శనం, అద్దె గదులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది… కోటా విడుదల చేసిన పది నిమిషాలలొనే అన్ని టికెట్లు బుక్ అయిపోయే పరిస్థితి.. ఈ డిమాండ్ ను దీనిని క్యాష్ చేసుకునేందుకు కొందరు ఫేక్ వెబ్‌సైట్లను క్రియేట్ చేసి దోపిడీ మొదలుపెట్టారు. సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారిక వెబ్‌సైట్‌లా డిజైన్ చేసి. స్వామి వారి భక్తులను బోల్తా కొట్టిస్తున్నారు. ఏది అసలో.. ఏది ఫేకో తెలీక చాలా మంది భక్తులు ఈ నకిలీ వెబ్‌సైట్లలో టికెట్లను బుక్ చేసి మోసపోతున్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్లపై భక్తులకు అవగాహన కల్పిస్తూ నకిలీ వెబ్‌సైట్లతో మోసపోవద్దని భక్త్తులకు విజ్ఞప్తి చేస్తోంది. https://tirupatibalaji.ap.gov.in/ పేరుతో టీటీడీకి అధికారిక వెబ్‌సైట్ ఉంది. ఇది మాత్రమే అసలైనదని కానీ చిన్న మార్పులతో https://tirupatibalaji-ap-gov.org/ రూపొందించిన ఈ ఫెక్ వెబ్‌సైట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ భక్తులకు సూచిస్తోంది.
previous post