ఇప్పుడవన్నీ నెంబర్ల గోలే.. ఫాలోవర్స్, వ్యూస్, రీచ్, లైక్స్, ఇవే మనిషినైనా, ప్రోడక్ట్ అయినా, ప్రోజక్ట్ నైనా, డిసైడ్ చేసేవి. ఒకప్పటి థియేటర్ లెక్కలు.. కలెక్షన్ రిపోర్ట్లు… ఈరోజు వ్యూస్ లోకి కన్వర్ట్ అయిపోయాయి. ఏ టీజర్ ఎంతమంది చూశారు.. ఏ పాటకి ఎన్ని లైక్స్ వచ్చాయి.. ఇదే మేటరు. ఎక్కడో శ్రీలంకలోని ఓ గాయని పాట పాడితే అది క్షణాల్లో విశ్వవ్యాపితమై కోట్లాది వ్యూస్ ని అంతకుమించిన ఆపర్చునిటీస్ ని కొలగొట్టింది. మరో సింగర్ ‘ హర హర శంభో’ అని గొంతు సవరిస్తే దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. మరో చోట ‘పల్సర్ బండి’ అని స్టెప్ వేస్తే ఆ బండిని కాస్త సినిమా వరకు తీసుకొచ్చింది. అది సోషల్ మీడియా పవర్. ఆ సంగతి అలా పక్కన పెడితే జనాలకి అతి త్వరగా చేరుకునే మాధ్యమమైన సోషల్ మీడియా ముఖ్యంగా యూట్యూబ్లో ఎన్నో టీజర్లు, పాటలు, రికార్డులు నెలకొల్పాయి. అలా 24 గంటల వ్యవధిలో అత్యధిక వ్యూస్ ను కోల్లగొట్టిన టీజర్లను, గ్లిమ్ప్స్ , ఫస్ట్ లుక్ లను గమనిస్తే ఇటీవల విడుదలైన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ టీజర్ 8.49 మిలియన్ న్యూస్ తో టాప్ పొజిషన్లో నిలిచింది. అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నూతన దర్శకుడు రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం గా పొందిన ‘అమిగోస్’ టీజర్ జస్ట్ 24 గంటల స్వల్ప వ్యవధిలో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డుగా నిలిచింది. ఎప్పటికప్పుడు కొత్త కథలు సెలెక్ట్ చేసుకుంటూ టాలెంటెడ్ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ బింబిసారా సూపర్ డూపర్ హిట్ తరువాత నటిస్తున్న ఈ చిత్రం లో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం.., టీజర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్గా సాగడంతో నిర్ణీత వ్యవధి లో ఎక్కువ సంఖ్యలో ఆడియన్స్ ఈ టీజర్ ని వీక్షించారు. త్వరలో విడుదల కానున్న లిరికల్ వీడియోస్, ట్రైలర్స్, కూడా ప్రేక్షకులకు ఇదే తరహాలో రీచ్ అవుతుందని ఆశిద్దాం. ఇక 24 గంటల్లోపు ఎక్కువ వ్యూ సాధించిన టాప్ టెన్ వీడియోలను పరిశీలిస్తే టాప్ లో ఉన్న అమిగోస్ తరువాత ‘ట్రిపుల్ ఆర్’ గ్లిప్స్ 7.53 మిలియన్ వ్యూస్స్ తో ,మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ 7.49 మిలియన్ న్యూస్ తో నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ 7.35 మిలియన్ న్యూస్ తో రెండు, మూడు, నాలుగు, స్థానాల్లో ఉన్నాయి. అదే విధంగా బాలకృష్ణ 107 చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ (7.28) ‘సైరా నరసింహారెడ్డి’ గ్లిమ్ప్స్( 7.20) భీమ్ ఫర్ రామరాజు ‘ట్రిపుల్ ఆర్’ ఫస్ట్ టీజర్ (7.09) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురం’ టీజర్ (7.06) సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ (6.87) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘వినయ విధేయ రామ’ (6.79) వ్యూస్స్ ని తొలి 24 గంటల్లోనే సాధించి ప్రేక్షకులకు చేరువయ్యాయి.