తిరుపతి జిల్లాలో శనివారం రాత్రి చిరుతపులి కలకలం రేపింది. వడమాలపేట మండలం బాలినాయుడు కండ్రిగ సమీపంలో ఉన్న అడవిలో చిరుత సంచారం కనిపించింది… నిత్యం పశువుల కాపర్లు పశువులను మేపుకోవడానికి వెళ్లే ప్రాంతంలో చిరుత సంచరించడం, అలానే అడవి గ్రామానికి దగ్గరగా ఉండడంతో గ్రామస్తులు భయాంధోళనకు గురవుతున్నారు.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమని తిరుగుతున్నారు… ఇదిలా ఉండగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్స్లీ హిల్స్‌లో పునుగుపిల్లి కనిపించింది. బి కొత్తకోట మండలంలోని హార్స్లీ హిల్స్‌లో టూరిజం గెస్ట్ హౌస్ వద్ద ఇనుప కంచెకు చిక్కుకొని ఉన్న వన్యప్రాణిని గుర్తించిన పర్యాటకులు దానిని కాపాడే ప్రయత్నం చేశారు. స్థానికంగా ఉన్న అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇనుప కంచెలో చిక్కుకున్నది పునుగుపల్లిగా నిర్ధారించుకున్న అటవీ శాఖ సిబ్బంది కాపాడారు. శేషాచలం అటవీ ప్రాంతంలో కనిపించే అరుదైన పునుగుపిల్లి ఇప్పుడు హార్సిలీ హిల్స్ లో కనిపించింది. తిరుమల వెంకటేశ్వరునికి పునుగు పిల్లి నుంచి సేకరించిన సుగంధ తైలం తో అభిషేకం చేస్తారు. ఇంతటి విశేష ప్రాధాన్యత ఉన్న ఈ అరుదైన వన్యప్రాణి అంతరించి పోతున్న జాతిగా భావిస్తున్న తరుణంలో తొలిసారిగా హార్సిలీ హిల్స్ లో కనిపించి అటవీశాఖ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 18 రకాల జాతులున్న పునుగు పిల్లుల్లో హార్స్ లీ హిల్స్ లో గుర్తించిన పునుగు పిల్లి ఆసియా రకానికి చెందినదిగా తెలిపారు. హార్స్ లీ హిల్స్ వాతావరణం పునుగుపిల్లికి అనువైనదిగా భావిస్తున్న అటవీ శాఖ పులుగుపిల్లి మనుగడ ఈ ప్రాంతంలో ఉన్నట్టు భావిస్తుంది
previous post