తిరుమల లో లడ్డు ప్రసాదం ఎంత ప్రత్యేకమో ఇప్పుడు టీటీడీ పంచగవ్య ఉత్పత్తులకు కూడా భక్తుల నుంచి అంతే ఆధరణ లభిస్తోంది. టీటీడీ తయారు చేసే అగర్ బత్తి లు దూప్ స్టిక్స్ అమ్మకాలలో రికార్డ్ సృష్టిస్తున్నాయి.. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు లడ్డుప్రసాడంతో పాటు తప్పనిసరిగా అగర్బత్తి లు గాని ఇతర పంచగవ్య ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు.. ఒక్కసారి మన పూజా కార్యకలాపాల్లో ఈ అగర్బత్తి వాడితే మరోసారి వేరే అగర్బత్తి వాడటానికి ఇష్టపడనంత గొప్పతనం ఉంది.. ఆ అగర్బత్తి లలో శ్రీవారి విగ్రహాన్ని తాకిన పూల పరిమళం అగర్బత్తి గా మన పూజలకు తొడయ్యింది.తిరుమల ఆలయాల్లో సేవలకు ఉపయోగించిన పువ్వులను పరమ పవిత్రంగా భావిస్తారు. ఆ పువ్వులతో పరిమళభరితమైన అగరబత్తులను తయారు చేసి భక్తులకు అందిస్తుంది టీటీడీ వైదిక సంస్కృతిలో దేవతలనివాసం భావించే గోమాత నుండి వచ్చే ఐదు (పంచ) ఉత్పన్నాలకు ఔషధ విలువల కారణంగా ఆయుర్వేదంలో విస్తృతంగా “పంచగవ్యాలు”గా ప్రసిద్ధి చెందాయి. స్థానిక జాతి గోవుల నుండి సేకరించబడిన పదార్థాలతో తయారయిన ఈ పంచగవ్య ఉత్పత్తులు ప్రజాధరణ పొందుతున్నాయి టీటీడీ మానవాళికి ఉపయోగపడేలా పంచగవ్య ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. శ్రీవారి భక్తులకు లడ్డు ప్రసాదంతో పాటు మరో ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే దేశవాళీ గోజాతులను అభివృద్ధి చేయడం కోసం దాతల సహకారంతో 500 దేశవాళీ గోవులను సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాజస్థాన్ నుంచి ఇప్పటి వరకు 120కి పైగా గిర్, కాంక్రీజ్ దేశవాళీ జాతుల గోవులను తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ తయారు చేసే సమగ్ర దాణాను గోవులకు అందించడం వల్ల పాల ఉత్పత్తి పెరగడంతో పాటు గోవులు ఇచ్చే పాలలో ప్రొటీన్ శాతం మరింత అధికంగా లభిస్తుందని టీటీడీ భావిస్తోంది. అటు అగరబత్తులకు కూడా భక్తుల నుంచి భారీగా డిమాండ్ ఉండటం తో దీనిపై దృష్టి కేంద్రీకరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే దేశీయ జాతి ఆవుల నుండి సేకరించిన పదార్థాలు. అవని ధూప చూర్ణం, అగర్బత్తిలు సాంబ్రాణి కప్పులు, ధూప కర్రలు మరియు ధూప శంకువులు. మొదలగు ఈ ధూప ఉత్పత్తులన్నీ ఆవుపేడ, అగరు మరియు వేప మిశ్రమం తో తయారు చేస్తారు, ఇవి పూర్తిగా సురక్షితమైనవి ఈ ఉత్పత్తుల నుండి వెలువడే పొగ యాంటీమైక్రోబియాల్ లాగా పని చేసి పరిసర ప్రాంతాలను పవిత్రం చేస్తుంది వీటి తయారీలో “పంచ భూతాత్మక హోమ గుండాలలో”ఆవు పేడ, “దూర్వా” (గణేశుడికి సమర్పించే గడ్డి రకం), కర్పూరం మరియు ఆవు నెయ్యి లనుభస్మం చేయడం ద్వారా సాంప్రదాయ పద్ధతులను అవలంబిస్తారు. కౌడంగ్ బూడిద, రాతి ఉప్పు (సైంధవ లవణం), లవంగాలు (లవంగ్), అమలకి (ఇండియన్ మైరోబోలన్) మరియు ఇతర మూలికలతో ఆయుర్వేద పద్ధతుల ప్రకారం రూపొందించబడిన టూత్ పౌడర్, హెర్బల్ ఫేస్ ప్యాక్ ,మహి హెర్బల్ సోప్ షికాకాయ్, సహజ సువాసనతో కొబ్బరి నూనె వంటి పదార్థాలతో పద్ధతిలో తయారు చేయబడిన హెయిర్ వాష్ మరియు కండీషనర్, ఫ్లోర్ క్లీనర్ గో-అర్కా (ఆవు మూత్రం స్వేదనం), నిమ్మ గడ్డి నూనె మరియు పైన్ ఆయిల్ వంటి ఉత్పత్తులతో పాటు ఆరోగ్య సంరక్షణ కు తోడ్పడే మరెన్నో ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తుంది.. వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ అగర్బత్తి లు మాత్రం అగ్రస్థానంలోనే ఉన్నాయి.. శ్రీ పాద, తుష్టి వంటి బ్రాండ్స్ ఎక్కువ గా భక్తులు కొనుగోలు చేస్తున్నారు ఈ సారి తిరుమల వెళ్ళినప్పుడు లడ్డు ప్రసాదం తో పాటు ఈ విశిష్ట ప్రసాదాన్ని కూడా తెచ్చుకుని ఇంటి పూజా మందిరంలో తిరుమల అనుభూతి ని పొందండి.. ఓం నమో వెంకటేశాయ.
previous post
next post